భోపాల్: దళిత మహిళ గురించి మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ జీతూ పట్వారీ చేసిన వ్యాఖ్యపైన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు మహిళలను గౌరవించడం తెలియదని, ఆ పార్టీకి ఉపయోగించుకుని వదిలేసే అలవాటు ఉందని అన్నారు.
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీతూ పట్వారీ.. ఇమర్తి దేవిపై పట్వారీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఇలాంటి నీచమైన పదాలు ఉపయోగిస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. ఇలాంటి పదాలు ఏ మహిళపై ఉపయోగించకూడదని సింధియా అన్నారు. ఇమర్తి దేవి 2020 మార్చిలో సింధియాతో కలిసి బీజేపీలో చేరారు.
పార్టీ కార్యకర్తలను, గిరిజన ప్రజలను, మహిళలను ఇలా ఎవరినైనా అవసరమున్నంత వరకు వాడుకుని, ఆ తర్వాత వదిలేయడం కాంగ్రెస్ పార్టీకి బాగా అలవాటని సింధియా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడూ తమపై దాడులు చేస్తూనే ఉంటుంది.. ఎప్పుడూ తమ విజయం తధ్యమని చెబుతుంది. చివరి ఫలితాలు తారుమారు అవుతాయని చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని సింధియా పేర్కొన్నారు.


