ప్రజల మధ్య చిచ్చుపెట్టి రెచ్చగొట్టడమే కాంగ్రెస్ పని

Congress Creates Quarrels Among People Says Amit Shah - Sakshi

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ప్రజల మధ్య గొడవలు పట్టడమే ఆ పార్టీ పని విమర్శలు గుప్పించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రెచ్చగొట్టకపోతే ఆ పార్టీ నాయకులకు మనశ్శాంతి ఉండదని మండిపడ్డారు.

హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి బీజేపీనే అధికారంలో వస్తుందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1985 నుంచి ఏ ప్రభుత్వమూ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాలేదని, ఈసారి తమదే విజయమని చెబుతున్న కాంగ్రెస్‌కు షాక్ ఇస్తామని స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో బీజేపీ నాలుగింట మూడొంతుల మెజార్టీతో గెలిచింది, కాబట్టి ఈసారి కూడా ప్రజలు తమనే గెలిపిస్తారని షా జోస్యం చెప్పారు. మోదీ అభివృద్దిని చూసి అందరూ తమకే పట్టంకడతారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్‌తో పాటు ఇతర మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
చదవండి: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం దేశాన్ని ముక్కలు చేస్తోంది

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top