బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ దేశాన్ని విభజిస్తున్నాయి.. అందుకే పాదయాత్రకు ఆ పేరు..

BJP RSS Ideology Breaking Country Rahul Gandhi Bharat Jodo Yatra Ballari - Sakshi

బెంగళూరు: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం దేశాన్ని ముక్కలు చేస్తోందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో భాగంగా కర్ణాటక కాంగ్రెస్‌ భళ్లారిలో శనివారం నిర్వహించిన భారీ ర్యాలీకి ఆయన హాజరయ్యారు.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల సిద్దాంతం దేశాన్ని విడదీస్తోందని వేల మంది భావిస్తున్నారని, అందుకే తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు చేపట్టిన పాదయత్రకు భారత్‌ జోడో(దేశాన్ని ఏకం చేయడం) పేరు పెట్టినట్లు రాహుల్ చెప్పారు.

భారత్‌ జోడో యాత్రను సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభించారు రాహుల్ గాంధీ. 3500కిలోమీటర్లకు పైగా 150 రోజులపాటు సాగనున్న ఈ యాత్ర కశ్మీర్‌లో ముగియనుంది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష‍్యంగా రాహుల్ ఈ యాత్రకు నడుం బిగించారు. ప్రస్తుతం 1,000 కిలోమీటర్లు పూర్తయింది. కర్ణాటక బళ్లారిలో కొనసాగుతోంది.
చదవండి: ‘కులం’ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీజేపీ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top