మేమంతా సిద్ధం 17వ రోజు: సీఎం జగన్‌ బస్సు యాత్ర సాగిందిలా | Sakshi
Sakshi News home page

మేమంతా సిద్ధం 17వ రోజు: సీఎం జగన్‌ బస్సు యాత్ర సాగిందిలా

Published Thu, Apr 18 2024 8:39 AM

CM YS Jagan Memantha Siddham Bus Yatra Day 17 Live Updates - Sakshi

Updates..

తూర్పుగోదావరి జిల్లా...

17వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర పర్యటన ముగించుకుని రాజానగరం మండలం ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్

రాజానగరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్..

 • భారీగా హాజరైన ప్రజలు. 
 • బస్సుపైకి ఎక్కి ప్రజలకు వైఎస్ఆర్‌సీపీ  శ్రేణులకు అభివాదం చేసిన సీఎం జగన్.

రాజానగరం వైపు సాగుతున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర 

 • రాజమండ్రి: గోకవరం బస్టాండ్ సెంటర్ కు చేరుకున్న బస్సు యాత్ర.
 • సీఎం జగన్‌కు స్వాగతం పలికిన జనం
 • దేవి చౌక్ సెంటర్‌లో  కిక్కిరిసిన జనం
 • జనసంద్రంగా మారిన రాజమండ్రి రోడ్లు
 • రాజమండ్రి నగరంలో సిఎం వైఎస్ జగన్ కి అపూర్వ స్వాగతం
 • అభిమానుల సందోహంతో పోటెత్తిన ఆజాద్ చౌక్.
 • పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీఎం జగన్కు స్వాగతం పలికిన ముస్లింలు .
 • జై జగన్ నినాదాలతో మార్మోగిన ఆజాద్ చౌక్ .
 • తమ అభిమాన నేతను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ముస్లిం సోదరులు.

చర్చిసెంటర్‌కు చేరుకున్న సీఎం జగన్‌ బస్సుయాత్ర

 • సీఎం జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు విశేషంగా హాజరైన ప్రజలు
 • బస్సుపై నుంచి ప్రజలకు సీఎం జగన్‌ అభివాదం

రాజమండ్రి సిటీలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన అభిమానులు 

 • ఆనందంతో డాన్స్ వేసి మరి సీఎం జగనకు స్వాగతం పలుకుతున్న యువతులు 
 • పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న రాజమండ్రి సిటీ 
 • జన సందోహంతో నిండిపోయిన మోరంపూడి, షెల్టన్, తాడితోట, ఆజాద్ చౌక్ , దేవి చౌక్ సెంటర్లు

తాడితోట జంక్షన్‌కు చేరుకున్న సీఎం జగన్

 • సీఎం జగన్‌కు పూలతో ఘన స్వాగతం పలికిన ప్రజలు
 • బూడిది గుమ్మడికాయలతో  దిష్టి తీసిన మహిళలు
 • జగన్ చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలు
 • ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన బస్సు యాత్ర

రాజమండ్రి నగరంలోకి ప్రవేశించిన సీఎం జగన్‌ బస్సుయాత్ర

 • మోరంపూడి జంక్షన్ దాటిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర
 • మరికాసేపట్లో తాడితోట జంక్షన్‌కు చేరుకోనున్న సీఎం బస్సుయాత్ర

మోరంపూడి జంక్షన్‌కు చేరుకున్న సీఎం జగన్‌ బస్సుయాత్ర

 • ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు
 • మేమంతా సిద్ధమంటూ సీఎం వైఎస్‌ జగన్‌కు జనహారతి.. 

వేమగిరికి చేరుకున్న సీఎం జగన్‌ బస్సుయాత్ర

 • వేమగిరిలో పోటెత్తిన జనసంద్రం
 • సీఎం జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు విశేషంగా హాజరైన ప్రజలు
 • బస్సుపై నుంచి ప్రజలకు సీఎం జగన్‌ అభివాదం

తూర్పుగోదావరి జిల్లా.
 
కడియపులంకలో పోటెత్తిన జనం

 • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బస్సుయాత్రకు సంఘీభావంగా రోడ్డుకు ఇరువైపుల బారులు తీరిన మహిళలు
 • మేమంతా సిద్ధమంటూ సీఎం వైఎస్‌ జగన్‌కు జనహారతి
 • కాసేపట్లో రాజమండ్రి నగరంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ రోడ్ షో

కడియపు లంక చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర

 • సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన ప్రజలు

తూర్పుగోదావరి జిల్లా: 

కడియపు లంక వద్ద జగన్‌కు స్వాగతం పలికేందుకు హైవే పై భారీగా చేరుకున్న ప్రజలు

 • సీఎం జగన్ పై తమ అభిమానం చాటుకునేందుకు పెద్ద ఎత్తన కడియపులంక,దుళ్ళ,జేగురుపాడు గ్రామాల నుండి చేరుకున్న మహిళలలు.
 • గంటల తరబడి మండుటెండలో జగన్ కోసం నీరిక్షణ
 • సీఎం జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న మహిళలు
 • చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను నమ్మేది లేదని స్పష్టం చేసిన మహిళలు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా:

పొట్టిలంక భోజన విరామ ప్రాంతానికి చేరుకున్న  సీఎం వైఎస్‌ జగన్‌

కోనసీమ జిల్లాలోకి మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

 • రావులపాలెంలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం
 • మండుటెండలోనూ జననేత కోసం పోటెత్తిన అభిమానం
 • సీఎం జగన్‌కు ప్రజల్లో అమితాదరణ
 • కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు
 • భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణసంచాతో ఆఖండ స్వాగతాలు

సీఎం జగన్‌ను కలిసిన మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణం రాజు

 • తేతలి నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ను కలిసిన మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణం రాజు.
 • రామకృష్ణంరాజును ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి.


 

వైఎస్సార్‌సీపీలోకి జనసేన, టీడీపీ కీలక నేతలు

 • తేతలిలో నైట్ స్టే పాయింట్ వద్ద రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల నుంచి జనసేన, టీడీపీకి చెందిన కీలక నేతలు వైఎస్సార్‌సీపీలోకి చేరిక
 • వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్‌
 • సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరిన రాజోలు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు, మాజీ పీఏసీ చైర్మన్ మేకల వీరవెంకట సత్యనారాయణ(ఏసుబాబు), టి.త్రిమూర్తులు, ఎం.నరసింహస్వామి, దొమ్మేటి సత్యనారాయణ, మంద సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కేశనపల్లి డి. సూర్యనారాయణ.
 • రాజోలు జనసేన పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు సారథ్యంలో వైఎస్సార్‌సీపీలోకి చేరిన జనసేన సర్పంచ్ కాకర శ్రీను, చింతా సత్యప్రసాద్.

మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన

 • 17వ రోజు కొనసాగుతోన్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
 • మండుటెండను సైతం లెక్కచేయక జననేత కోసం పోటెత్తిన జనం
 • పలువురి సమస్యలు వింటూ ముందుకు సాగుతున్న సీఎం జగన్‌
 • ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంగా సాగుతున్న యాత్ర
 • తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదగా బస్సు యాత్ర

తేతలి నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం

 • తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదగా పొట్టిలంక చేరుకోనున్న బస్సు యాత్ర
 • అనంతరం కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్‌, తాడితోట జంక్షన్‌, చర్చి సెంటర్‌, దేవిచౌక్‌, పేపర్‌ మిల్‌ సెంటర్‌, దివాన్‌ చెరువు, రాజానగరం మీదగా ఎస్‌టీ రాజపురం చేరుకోనున్న బస్సు యాత్ర
 • మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగునా అపురూప దృశ్యాలు 
   

17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

 • కాసేపట్లో తేతలి నుంచి బస్సు యాత్ర ప్రారంభం
 • తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదగా పొట్టిలంక చేరుకోనున్న బస్సు యాత్ర
 • అనంతరం కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్‌, తాడితోట జంక్షన్‌, చర్చి సెంటర్‌, దేవిచౌక్‌, పేపర్‌ మిల్‌ సెంటర్‌, దివాన్‌ చెరువు, రాజానగరం మీదగా ఎస్‌టీ రాజపురం చేరుకోనున్న బస్సు యాత్ర
   

అభిమానం.. ఆకాశమంత 

 • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో అమితాదరణ
 • కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు
 • జిల్లాలు దాటి ఎండా, వాన లెక్క చేయకుండా ప్రయాణం
 • పగలూ, రాత్రి తేడా లేకుండా వేచిచూస్తున్న అవ్వాతాతలు
 • చిందులు వేస్తూ ఉత్సాహపరుస్తున్న యువత
 • వేలాది బైకులతో భారీ ర్యాలీలు
 • గజమాలల పరిమాణం దాటి క్రేన్లు వాడాల్సిన పరిస్థితి
 • టన్నుల కొద్దీ పూలతో సీఎంకు భారీ దండలు, గజమాలలు
 • భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణ సంచాలతో అఖండ స్వాగతాలు 
 • మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగునా అపురూప దృశ్యాలు 
   

నేడు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ఇలా..

 • సీఎం జగన్‌ రాత్రి బస చేసిన తేతలి నుంచి గురువారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.
 • తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.
 • కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోటజంక్షన్, చర్చిసెంటర్, దేవిచౌక్, పేపర్‌ మిల్‌ సెంటర్, దివాన్‌ చెరువు, రాజానగరం మీదుగా ఎస్‌టీ రాజపురం వద్ద రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు.

Advertisement
 
Advertisement