ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర | CM YS Jagan Memantha Siddham Bus Yatra Day 15 Live Updates And Top Headlines - Sakshi
Sakshi News home page

మేమంతా సిద్ధం 15వ రోజు: సీఎం జగన్‌ స్పీచ్‌ హైలైట్స్‌

Published Mon, Apr 15 2024 8:53 AM

CM YS Jagan Memantha Siddham Bus Yatra Day 15 Live Updates - Sakshi

Live Updates..

 

కృష్ణాజిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..

గుడివాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్‌ స్పీచ్‌ హైలైట్స్‌

 • కృష్ణా జిల్లాలో ఈరోజు ఒక మహా సముద్రం కనిపిస్తోంది
 • ఇది ప్రజల సముద్రం
 • మే 13వ తేదీన జరగబోతున్న మహా సంగ్రామంలో మంచి వైపున నిలబడిన ప్రజల సముద్రం ఇది
 • ఈ సభకు వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్న దమ్ములకు, నా అవ్వా-తాతలకు, ప్రతీ ఒక్కరికీ మీ బిడ్డ హృదయ పూర్వకంగా పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
 • సమర శంఖం పూరిద్దామా.. ప్రజల సంక్షేమం కోసం, పేదల భవిష్యత్‌ కోసం, పథకాలన్నీ కాపాడుకునేందుకు, పథకాలన్నీ కొనసాగించేందుకు, ప్రతీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం, పెత్తందార్లపై యుద్ధానికి మీరంతా సిద్ధమేనా?

 • ఇక్కడున్నది మంచి చేశామన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్‌.
 • చుట్టుముట్టునది ఏ మంచి కూడా చేయని అబద్ధాలే పునాదాలుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న కుట్రదారుల అటువైపున..
 • ఒక్క మీ జగన్‌ మీద ఎంతమంది దాడి చేస్తున్నారంటే.. ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ-5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్‌.. ఇవన్నీ సరిపోవంటూ ఎన్నో కుట్రలు, ఎన్నో మోసాలు చేస్తున్నారు
 • కుటిల పద్మవ్యూహంలో ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్‌ మీద.
 • మీకు మంచి చేసిన మీ జగన్‌ మీద, మీ బిడ్డ మీద దాడి చేస్తున్నారు. 
 • అయినా మీ బిడ్డ అదరడు.. మీ బిడ్డ బెదరడు
 • కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ.
 • చేసిన మంచి మీద, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టే..అర్జునుడి మీద ఒక్క బాణం వేసినంత మాత్రాన కౌరవులు గెలిచినట్లు కాదు

 • జగన్‌ మీద ఒక్క రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు
 • ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు
 • పైగా మీరు ఈ స్థాయికి దిగజారారు అంటే.. విజయానికి మనం అంత చేరువగా ఉన్నామని, వారు విజయానికి అంత దూరంగా ఉన్నారనే కదా అని అర్థము
 • ఈ తాటాకు చప్పళ్లుకు మీ బిడ్డ అదరడు.. బెదరడు
 • మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్పా ఏ మాత్రం తగ్గదు
 • నుదుటి మీద వారు చేసిన గాయంతో బయటపడ్డానంటే అంటే దానర్థం. దేవుడు  మీ బిడ్డ విషయంలో  ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ రాశాడు అని దానర్థం.
 • నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ,  పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు.
   

 • మీ జగన్‌పై చంద్రబాబు అండ్‌ కో దాడి చేస్తోంది
 • రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అది ఇవ్వొద్దని ఎవరు చెప్పారు.. అది బాబే
 • కిలో రెండో రూపాయిలకే బియ్యం ఇవ్వొద్దని ఎన్టీఆర్‌ను దింపేసి ఐదు రూపాయల 25 పైసలకు పెంచేసింది ఎవరు.. అది ఈ బాబే
 • ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దన్నది ఎవరు.. అది ఈ బాబే
 • గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే
 • పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి కేసులు వేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే
 • తాను ముఖ్యమంత్రిగా ఉంటూ  ఎస్సీలను, బీసీలను అవహేళన చేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే
 • విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే
 • ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే
 • ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టంది ఎవరంటే.. అది కూడా ఈ బాబే
 • చివరకు అన్ని ఓడిపోయిన ఈ చంద్రబాబును, అతాకుతలమైన ఈ చంద్రబాబును ఎన్టీఆర్‌ చేరదీసి కూతుర్ని ఇస్తే.. ఆ ఎన్టీఆర్‌ కుర్చీని లాగేసుకుని, ఎన్టీఆర్‌ చావుకు కారణమైన వ్యక్తి ఎవరంటే.. అది కూడా ఈ బాబే.

 • విప్లవాత్మక మార్పులు మీ బిడ్డ పాలనలో జరిగాయి
 • జన్మభూమి కమిటీలతో చంద్రబాబు గ్రామాలను దోచేశాడు
 • పెట్టుబడి సాయంగా రైతన్నకు  రైతు భరోసా ఇస్తున్నాం
 • ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చింది మీ జగన్‌.. మీ బిడ్డ
 • పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం
 • విత్తనం నుంచి పంట కొనుగోలు వరకూ తోడుగా ఉంటున్నాం
 • 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించాం
 • మనం చేసిన మార్పులతో పెత్తందార్ల కడుపు మండుతోంది
 • 58 నెలల్లోనే మీ బిడ్డ సంక్షేమాన్ని మీ ఇంటికి తీసుకొచ్చాడు
 • ప్రతి గ్రామంలోనూ మీ జగన్‌ మార్క్‌ కనిపిస్తోంది
 • రూ. 3 వేల పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రం దేశంలో మనదే
 • గ్రామ సచివాలయాల ద్వారా 600పైగా సేవలు

 • రాష్ట్రంలో వేగంగా అడుగులు పడుతున్నాయంటే  మీ జగన్‌.
 • 10 ఫిషింగ్‌ హార్బర్‌లు వస్తున్నాయంటే మీ జగన్‌
 • 10 ఫిషింగ్‌ ల్యాండ్‌ సెంటర్లు అంటే మీ జగన్‌
 • ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ అంటే మీ జగన్‌
 • కొత్త భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పనులు వాయువేగంతో జరుగుతున్నాయంటే మీ జగన్‌
 • మూడు ఇండస్ట్రీయల్‌ కారిడార్లు, 10 ఇండస్ట్రీయల్‌ నోట్స్‌ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్‌
 • ప్రణాళిక బద్ధంగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయంటే మీ జగన్‌
 • వరుసగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌వన్‌గా వస్తున్నామంటే మీ జగన్‌
 • మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మ్యానిఫెస్టో అంటే ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా భావించి 99శాతం హామీలను నెరవేర్చిన ఘనత మనది
 • కాబట్టే మన జెండా తలెత్తుకుని ఎగురుతోంది. మరి వారి జెండా నలుగురితో జత కట్టినా ఎగరలేక కింద పడుతోంది
 • మరి ఇంటింటి  అభివృద్ధి కొనసాగాలా.. వద్దా?
 • మరి ఇంటింటి అభివృద్ధిని కాపాడుకోవాలా.. వద్దా..
 •  అందుకే మళ్లీ చెబుతున్నా.. ఈ ఎన్నికల్లో ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడమే కాదు..  రాబోయే ఐదేళ్లలో మీ భవిష్యత్‌ను నిర్ణయించేవే ఈ ఎన్నికలు.
 • ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన బ్రతుకులు బాగుంటాయనే ఆలోచన చేయండి
 •  అలా ఆలోచన చేసి ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి కొనసాగుతుందనే విషయం గుర్తు పెట్టుకోండి
 • చంద్రబాబు కూటమి చరిత్రను కూడా ప్రతీ ఇంటికి వెళ్లి వివరించండి
 • 2014లో చంద్రబాబు అండ్‌ కో కూటమిగా ఏర్పడి ప్రజలను మోసం చేసిన వైనాన్ని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి

మనందరి నమ్మకం సీఎం జగన్‌: కొడాలి నాని

 • సీఎం జగన్‌ పాలనతోనే సంక్షేమం సాధ్యమైంది
 • వాలంటీర్‌ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారు
 • పిల్లల భవిష్యత్‌ కోసం ఆలోచించిన నాయకుడు సీఎం జగన్‌
 • ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతోమందిని ఆదుకున్నారు
 • చంద్రబాబుది మాయా కూటమి
 • సీఎం జగన్‌ను ఎదుర్కోలేక కుట్రలు చేశాడు
 • దేవుడు, ప్రజల ఆశీస్సులే సీఎం జగన్‌ను కాపాడాయి


 

గుడివాడ ‘మేమంతా సిద్ధం’ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్‌

 • ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్‌
 • జై జగన్‌ నినాదాలతో హోరెత్తిన సభా ప్రాంగణం

కాసేపట్లో గుడివాడలో సీఎం జగన్‌ భారీ బహిరంగ సభ

 • మేమంతా సిద్ధం సభకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు
 • మేమంతా సిద్ధం అంటూ నినదిస్తున్న అభిమాన తరంగం
 • గుడివాడ మేమంతా సిద్ధం సభలో జనప్రభంజనం
 • జై జగన్‌ నినాదాలతో హోరెత్తుతున్న సభా ప్రాంగణం
 • మేమంతా సిద్ధం సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌

కృష్ణాజిల్లా:

గుడివాడలో జరిగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం సభ

 • బహిరంగ సభకు అవనిగడ్డ నుంచి వేలాదిగా తరలి వెళ్లిన కార్యకర్తలు అభిమానులు 
 • జెండా ఊపి బస్సులను ప్రారంభించిన అవనిగడ్డ జడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ

గుడివాడ నియోజకవర్గం పుట్టగుంటలో సీఎం వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికిన ప్రజలు

 • మరి కాసేపట్లో జొన్నపాడు వద్ద భోజనం విరామం

హనుమాన్ జంక్షన్  ప్రాంతానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

 • సీఎం జగన్‌కు భారీగా స్వాగతం పలుకుతున్న ప్రజానికం

ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నా: సీఎం జగన్‌

 • పార్టీ నేతలకు ధైర్యం చెప్పిన సీఎం జగన్‌
 • మనకు దేవుడి దయ, ప్రజల ఆశ్వీరాదం ఉంది. 
 • ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నాను.
 • ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు. 
 • ధైర్యంగా ముందుకు అడుగువేద్దాం. 
 • ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. 

తేలప్రోలుకు చేరుకున్న సీఎం జగన్‌ బస్సుయాత్ర

అడుగడుగునా హారతులు, పూలతో స్వాగతం పలుకుతున్న ప్రజలు

ఆత్కూరు దాటి ముందుకు సాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర..

గన్నవరం‌ జంక్షన్ చేరుకున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర. 

ప్రజలతో కిక్కిరిసిన గన్నవరం రహదారులు

సీఎం జగన్‌కి దారిపొడవునా గన్నవరం ప్రజల అపూర్వ స్వాగతం

గన్నవరంలోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర

 • సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలుకుతున్న గన్నవరంవాసులు 
 • జనసంద్రమైన గన్నవరం.
 • టీడీపీ కుట్రలకు ఓటుతోనే బుద్ధి చెబుతామంటున్న గన్నవరంవాసులు

జనం సమస్యలు వింటూ..

 • దాడి తర్వాత తొలిసారి ప్రజల్లోకి సీఎం జగన్‌
 • కేసరపల్లిలో యాత్ర ప్రారంభమైన కాసేపటికే.. 100 మీటర్ల పరిధిలో రెండుసార్లు బస్సు నుంచి బయటకు వచ్చిన సీఎం జగన్‌
 • బయటకు వచ్చి ప్రజల సమస్యలు వింటున్న సీఎం జగన్‌

ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సు యాత్ర

 • కృష్ణా జిల్లాలో ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర
 • కేసరపల్లి నుంచి ప్రారం‍భమైన సీఎం జగన్‌ బస్సు యాత్ర
 • దాడి ఘటనలో గాయపడిన సీఎం జగన్‌.. విశ్రాంతి తీసుకుని ఒక్కరోజు విరామంతో యాత్ర చేపట్టిన సీఎం జగన్‌
 • నిఘా నీడలో కొనసాగనున్న యాత్ర
 • సీఎం జగన్‌ పర్యటించే ప్రాంతాల్లో నిశితంగా పరిశీలించనున్న అధికారులు
 • పూలు జల్లడం, క్రేన్‌లతో గజమాలలపై ఆంక్షలు విధించిన అధికారులు
 • సాయంత్రం గుడివాడలో భారీ బహిరంగ సభ
 • జనసంద్రంగా మారిన గన్నవరం
 • ఉక్కు సంకల్పంతో ముందుకు సాగనున్న యాత్ర

సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరికలు

 • కేసరపల్లి క్యాంప్‌ వద్ద సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ నేతలు దేవినేని గౌతమ్, దేవినేని స్మిత, కాంగ్రెస్ నేత.. ఉక్కు కాకాని రామ్మోహన్ రావు మనవడు కాకాని విజయ్ కుమార్
 • సీఎం జగన్‌ సమక్షంలో వైస్సార్సీపీలో చేరిక


జన సంక్షేమ సారథి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు గన్నవరంకు భారీగా చేరుకుంటున్న జనం, వైఎస్సార్సీపీ శ్రేణులు.
మరికాసేపట్లో కేసరపల్లి నుంచి ప్రారంభంకానున్న బస్సు యాత్ర

వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఒక్కరోజు విరామం అనంతరం ఇవాళ తిరిగి కొనసాగనుంది. యాత్రలో భాగంగా 15వ రోజైన సోమవారం కేసరపల్లి దగ్గర నుంచి సీఎం జగన్‌ సోమవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. 

బస్సు యాత్రలో భాగంగా గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్‌ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ చేరుకుంటారు. 


గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హనుమాన్‌ జంక్షన్‌ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్‌ చేరుకుంటారు.

Advertisement
 
Advertisement