
రిజర్వేషన్లు రద్దు చేయడం ఆర్‌ఆర్‌ఎస్ మూల సిద్దాంతం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్లు రద్దు చేయడం ఆర్‌ఆర్‌ఎస్ మూల సిద్దాంతం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రిజర్వేషన్ల రద్దుపై చర్చ జరగకుండా తమపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రిజర్వేషన్ల పై బీజేపీ పెద్దలు తమ వైఖరిని ఎందుకు స్పష్టం చేయడం లేదంటూ ప్రశ్నించారు.
‘‘2024 ఎన్నికల్లో బీజేపీ రహస్య ఎజెండా అమలు చేస్తుంది. ఎన్నికల్లో నెగ్గడానికి మాపై ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారు. ఢిల్లీ సుల్తానులకు తెలంగాణ భయపడదు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి. ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే వారి అజెండా.2000 సంవత్సరం ఫిబ్రవరి లో రాజ్యంగం మార్పు కు బీజేపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి కమిషన్ ఏర్పాటు చేసింది’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.