17 రోజులు.. 41 సభలు  | CM KCR will start the election campaign from 15th October 2023 | Sakshi
Sakshi News home page

17 రోజులు.. 41 సభలు 

Oct 11 2023 4:58 AM | Updated on Oct 11 2023 6:39 PM

CM KCR will start the election campaign from 15th October 2023 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 15న పార్టీ అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేయడంతోపాటు మేనిఫెస్టోను ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. ఈ నెల 15 నుంచి నవంబర్‌ 9 వరకు 17 రోజుల వ్యవధిలో 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. ఈ నెల 15 నుంచి 18 వరకు వరుసగా సభల్లో పాల్గొని సద్దుల బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో 19 నుంచి 25 వరకు విరామం తీసుకోనున్నారు.

తిరిగి ఈ నెల 26 నుంచి వచ్చే నెల 9 వరకు వరుస సభల్లో కేసీఆర్‌ పాల్గొననున్నారు. నవంబర్‌ 4న కూడా ప్రచారానికి కేసీఆర్‌ విరామం ప్రకటించారు. నవంబర్‌ 9న గజ్వేల్, కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కేసీఆర్‌ నామినేషన్లు దాఖలు చేసి కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి సీఎం ఎన్నికల ప్రచార సభల తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేశారు. పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్‌ పర్యటన షెడ్యూల్‌లో కొన్ని మార్పుచేర్పులు ఉండొచ్చని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement