Chhattisgarh Assembly Election 2023 Final Results: ఛత్తీస్‌గఢ్‌లో తారుమ‌రైనా ఎగ్జిట్ పోల్స్.. ఉత్కంఠ పోరులో బీజేపీ అధిక్యం..

Chhattisgarh Assembly Election 2023 Final Results - Sakshi

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ హోరాహోరి  నెలకొంది. అలాగే ఎన్నిక‌ల కౌటింగ్ ప్ర‌క్రియ కూడా నువ్వానేనా అనేలా కొన‌సాగుంది. అయితే, మళ్లీ హస్తం పార్టీకే అవకాశాలున్నట్లు అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. అయితే  ఫ‌లితాలు మాత్రం తారుమారు అయ్యేలా క‌నిపిస్తున్నాయి. బీజేపీ అనూహ్యంగా పుంజుకొని.. 52 సీట్లు అధిక్యంలో ముందువ‌రుస‌లో కొన‌సాగుతోంది. అలాగే కచ్చితంగా గెలుస్తామ‌నే ధీమాతో ఉన్న కాంగ్రెస్ మాత్రం 37 సీట్ల‌తో కొన‌సాగుతుంది. కాంగ్రెస్ లేదా బీజేపీ అధికారంలోకి రావాలంటే.. మెజారిటీ మార్కు 46 అసెంబ్లీ సీట్లు సాధించాలి. అయితే ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘేల్ Patan assemblyలో వెన‌కంజ‌లో ఉన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో 33 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్‌ సాగుతోంది. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు 90 మంది రిటర్నింగ్‌ అధికారులు, 416 మంది సహాయ రిటర్నింగ్‌ అధికారులు, 1,698 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. రాష్ట్రంలో మొత్తం 1,181 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్‌ నుంచి సీఎం భూపేశ్‌ బఘెల్, ఉప ముఖ్యమంత్రి టీఎస్‌ సింగ్‌దేవ్, బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ తదితర ప్రముఖులున్నారు. 

ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు జరిగింది. కొన్ని నియోజకవర్గాల్లో మాజీ సీఎం అజిత్‌ జోగి జనతా కాంగ్రెస్‌, BSP ప్రభావం కూడా ఉంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ డివిజన్‌లో అభ్యర్థులను నిలిపింది. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘేల్‌ కేంద్రంగా కాంగ్రెస్‌ ప్రచారం సాగింది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌తో బీజేపీ తరపున ఆయన సమీప బంధువు విజయ్‌ బఘేల్‌ తలపడ్డారు. అజిత్‌ జోగి జనతా కాంగ్రెస్‌ తరపున అమిత్‌ జోగి కూడా సీఎంతో తలపడ్డారు.

తొలి విడతలో 20 స్థానాలు, 70 స్థానాలకు రెండో విడతలో పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో 78 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో 958 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. గిరిజన జనాభా అధికంగా ఉంటే ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలో 90 స్థానాలున్నాయి. 2003 నుంచి 2018 వరకు 15 ఏళ్లు ఛత్తీస్‌గఢ్‌ను బీజేపీ పాలించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top