4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం! | gold price today rate may 15 | Sakshi
Sakshi News home page

4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!

May 15 2024 11:49 AM | Updated on May 15 2024 12:35 PM

gold price today rate may 15

అక్షయ తృతీయ తర్వాత తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ మోత మోగించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 15) గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగింది. ప్రస్తుతం రూ.67,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.430 పెరిగి రూ. 73,250 లను తాకింది.

ఇతర ప్రధాన నగరాల్లో ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.430 ఎగిసి రూ.73,400 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,150లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.430 పెరిగి రూ.73,250 లకు చేరుకుంది.

ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,150 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.430 పెరిగి రూ.73,250 లకు ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 పెరిగి రూ.67,250ల​కు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.380 ఎగిసి రూ.73,360 లను తాకింది.

వెండి ధరలు
దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు పెరిగాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.91,000లుగా ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement