Bengal Tiger: అభిమన్యు వెళ్లిపోయాడు | Royal Bengal Tiger dies at Nehru Zoological Park | Sakshi
Sakshi News home page

Bengal Tiger: అభిమన్యు వెళ్లిపోయాడు

May 15 2024 7:19 AM | Updated on May 15 2024 7:19 AM

Royal Bengal Tiger dies at Nehru Zoological Park

జూలో తెల్లపులి మృతి

బహదూర్‌పురా: నెహ్రూ జూ పార్క్‌లో అభిమన్యు అనే 8 ఏళ్ల తెల్లపులి కిడ్నీ సంబంధిత వ్యాధితో మంగళవారం మృతి చెందింది. నెహ్రూ జులాజికల్‌ పార్క్‌లో 2016 సంవత్సరం మే నెలలో బద్రి, సమీరాలకు రెండు తెల్లపులి కూనలు జని్మంచాయి. 

అందులో ఒకటైన అభిమన్యు జూలోనే పెరిగింది. ఇది మృతి చెందడంతో అధికారులు వీబీఆర్‌ఐ, లాంకోన్స్‌తో పాటు ఇతర విభాగాల శాస్త్రవేత్తలు, డాక్టర్లు జూలోనే పోస్టుమార్టం నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా నెహ్రూ జులాజికల్‌ పార్కులో కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో పులులు, సింహాలు, చిరుత పులులు మృతి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది.   

Advertisement
 
Advertisement
Advertisement