పరిచయం పెంచుకొని.. పాపను విడిచి | Mother Cheating To Daughter | Sakshi
Sakshi News home page

పరిచయం పెంచుకొని.. పాపను విడిచి

May 15 2024 11:30 AM | Updated on May 15 2024 12:34 PM

Mother Cheating To Daughter

రాయగడ: రైలులో ప్రయాణించిన ఒక మహిళ పక్కనే తనతో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికురాలితో మాటామాటా కలిపి పరిచయం పెంచుకొని, చివరకు గమ్యం స్థానం చేరేసరికి పాపను విడిచి పరారైంది. మునిగుడలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని చంద్రపూర్‌ ప్రాంతానికి చెందిన అనంత్‌ క్రొటింగ్‌ అనే మహిళ మంగవారం ఏదో పనిమీద రాయగడ వచ్చారు. పనులు ముగించుకున్న అనంతరం తిరిగి తన స్వగ్రామానికి వెళ్లేందుకు రాయగడలో ట్రైన్‌ ఎక్కింది.

 జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లో కూర్చుంది. పక్కనే మరో మహిళ చంటి పాపతో ప్రయాణం చేస్తోంది. కొద్దిదూరం ప్రయాణం చేసిన తర్వాత వారి మధ్య మాటామాటా కలిసి పరిచయం పెరిగింది. అనంతరం మునిగడు రైల్వేస్టేషన్‌లో ఇద్దరు మహిళలు దిగారు. ఇంతలో పాపను కాసేపు ఎత్తుకోండి టాయ్‌లెట్స్‌కు వెళ్లి వస్తానని చెప్పి పాపను క్రొటింగ్‌ అనే మహిళకు అప్పగించింది. పాపను ఎత్తుకున్న క్రొటింగ్‌ గంటలు తరబడినా ఎదురుచూసిన వాళ్ల అమ్మ రాలేదు.

 దీంతో కావాలనే పాపను విడిచిపెట్టాలని నిర్ణయించకున్నారని అర్థం చేసుకొని మునిగుడ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించింది. వెంటనే ఐఐసీ సౌదామిని బెహర వెంటనే స్పందించి జిల్లా శిశుసంరక్షణ కేంద్రం వారికి సమాచారం అందించారు. ప్రస్తుతం పాప శిశు సంరక్షణ కేంద్రంలో సురక్షితంగా ఉంది. అయితే పాపను ఎత్తుకుని ప్రయాణించిన మహిళ ఎవరు, ఎక్కడి నుంచి ప్రయాణించింది, పాపను విడిచిపెట్టి వెళ్లడంపై సమగ్ర దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. రైల్వేస్టేషన్‌లో ఉన్న సీసీ కెమేరాల ఆధారంగా ఆ మహిళను గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement