
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపణలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఖండించారు. గత ప్రభుత్వమే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శించారు. రాష్ట్ర అప్పులపై ఆందోళన వద్దని తెలిపారు. టీడీపీ నేతలు మాట్లాడే మాటలకు ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు. ఒకసారి 4 లక్షల కోట్ల మరోసారి 10 లక్షల కోట్ల అప్పు అంటున్నారని దుయ్యబట్టారు. కోవిడ్ ఇబ్బందులతోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదని తెలిపారు.
‘స్కిల్ స్కామ్ జీఎస్టీ వల్ల బయట పడింది. 2018లోనే ఏపీ రాష్ట్రానికి విచారణ చెయ్యమని లేఖ రాశారు. జీఎస్టీ, సెబీ, ఈడీ విచారణ చేసిన స్కామ్ ఇది. 2017 నుంచి ఈ కేసులో విచారణ జరుగుతోంది. అలాంటి కేసులో సీఐడీ విచారణ చెయ్యకూడదా..? సిమెన్స్ సంస్థలు ఉన్నాయని చెప్తున్నారు. అసలు వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటో తెలుసా..? 5 రోజుల్లో ట్రైనింగ్ సాధ్యమా..? దానిని ట్రైనింగ్ అంటారా..? డెమో చూపించి దాన్నే ట్రైనింగ్ అని కోట్లు కొల్లగొట్టారు..? మా హయాంలో 3 నెలల, 5 నెలలు, 4 నెలలు పాటు ట్రైనింగ్ ఇస్తున్నాం.
రూ. 370 కోట్లకి డిజైన్ టెక్ ఈరోజుకి ఎంత ఖర్చయ్యిందో బిల్లే ఇవ్వలేదు. సీమన్స్ కంపెనీ అసలు ఈ గ్రాంట్ ఇన్ కైండ్ అన్న పద్ధతే లేదు అని చెప్పింది. అనంతపురం జేఎన్టీయూ సెంటర్‌లో లెక్కేస్తే 8 కోట్లు పరికరాలు ఉన్నాయి. ఎంత చూసిన ఈ స్కామ్‌లో 250 కోట్లు లెక్కలు దొరకడం లేదు. పయ్యావుల కేశవ్ కోర్టు తేల్చేంత వరకు ఓపిక పట్టాలి. కోర్టుకి ఆధారాలు చూపించామో లేదో వీళ్లకు తెలుసా..? విచారణలో సేకరించిన ఆధారాలు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment