‘మోదీ 3.0 ఎంతో దూరంలో లేదు’ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు 40 సీట్లుకూడా రావు: రాజ్యసభలో ప్రధాని మోదీ చురకలు

Published Wed, Feb 7 2024 2:33 PM

Budget Session: PM Modi Speech At Rajya Sabha Feb 07 Updates - Sakshi

ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్‌ పతనం తనకేమీ ఆనందం ఇవ్వదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభలో మొన్నీమధ్య కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ప్రధాని మోదీ.. ఇవాళ రాజ్యసభలోనూ హస్తం పార్టీపై సెటైర్లు వేశారు. రాజ్యసభలో.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తున్నారు. 

‘‘రాష్ట్రప్రతి ప్రసంగంపై జరిగిన చర్చలో సభ్యులు కొందరు తమ అభిప్రాయాలు చెప్పారు. మరికొందరు విమర్శలు గుప్పించారు.  లోక్‌సభలో ఖర్గేను చాలా మిస్‌ అయ్యాను, రాజ్యసభలో కలవడం ఆనందంగా ఉంది. ఖర్గే చాలా శ్రద్ధగా వింటున్నారు. ఖర్గే స్వేచ్ఛగా మాట్లాడారు. ఆయనకు అంతటి స్వేచ్ఛ ఎలాగ వచ్చిందని నాకు ఆశ్చర్యమేసింది. బహుశా ఆ రోజు వారి స్పెషల్‌ కమాండర్లు ఇద్దరు (కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌ను ఉద్దేశిస్తూ) ఆ రోజు సభకు రాలేదేమో! అంటూ ప్రధాని మోదీ చురకలు అంటించారు. 

మాకు 400 సీట్లు రావాలని ఖర్గే ఆశీర్వదించారు.కానీ, కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావు. ఈ విషయాన్ని వాళ్ల మిత్రపక్షంలోని నేత మమతా బెనర్జీనే చెప్పారు. చూస్తుండగానే కాంగ్రెస్‌ పరిస్థితి దిగజారిపోయింది. కాంగ్రెస్‌ పతనం నాకేమీ ఆనందం ఇవ్వదు. కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఆలోచనల్లోనూ కాంగ్రెస్‌ ఔట్‌డేటెడ్‌ అయ్యింది.  కాంగ్రెస్‌ పత్రికా స్వేచ్ఛను కాలరాసింది. అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వాలని ఏనాడూ కాంగ్రెస్‌ అనుకోలేదు. కానీ, వాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రం భారతరత్న ఇచ్చుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని రాత్రికి రాత్రి కూల్చేసింది. దేశాన్ని విభజించే కుట్ర ఇప్పుడు మరోసారి కాంగ్రెస్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణ, ఉత్తరం అంటూ దేశాన్ని రెండు ముక్కలు చేసే యత్నం చేస్తోంది. నా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కొందరు యత్నిస్తున్నారు. నాకు మాట్లాడే అధికారాన్ని ప్రజలు కట్టబెట్టారు.. 

పదేళ్లలో ఆర్థిక వ్యవస్థను ఐదో స్థానానికి తీసుకొచ్చాం. రైతులు, యువత, మహిళలకు మేం ప్రాధాన్యత ఇచ్చాం. జీఎస్టీని సమర్థవంతంగా అమలు చేస్తున్నాం.  ఆర్థిక స్థితిని పురోగతిని ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మనోహ్మన్‌ సింగ్‌ కూడా కొనియాడారు.

 యూపీఏ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయ్యింది. ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్‌ వ్యతిరేకం. కనీసం యుద్ధవీరులను కూడా కాంగ్రెస్‌ గౌరవించలేదు..  ఒక్క వార్‌ మెమోరియల్‌ కూడా కట్టలేకపోయింది.  కాంగ్రెస్‌ హయాంలో ఉగ్రవాదం పెరిగిపోయింది. కాంగ్రెస్‌ను స్థాపించింది ఓ బ్రిటీషర్‌. కాంగ్రెస్‌ భారత సంస్కృతిని అసహ్యించుకుంది. బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎలా నడిస్తే.. మన పార్లమెంట్‌ను అలా నడిపించారు. విదేశీ వస్తువుల్ని కాంగ్రెస్‌ స్టేటస్‌ సింబల్‌గా భావించింది. ఆ బానిసత్వ గుర్తులను మేం చెరిపేస్తున్నాం. 

కశ్మీర్‌లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు దక్కకపోవడానికి కాంగ్రెస్‌ కారణం. తాను రిజర్వేషన్లకు వ్యతిరేకమని నెహ్రూ అన్నారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం అన్నారు. దీనిపై నెహ్రూ ఆనాడు ముఖ్యమంత్రులకు రాసిన లేఖ రికార్డుల్లో ఉంది. ఆర్థికల్‌ 370ని కాంగ్రెస్‌ దశాబ్దాలపాటు సాగదీసింది. కావాలనే అట్రాసిటీ యాక్ట్‌లో జమ్ము కశ్మీర్‌ను కాంగ్రెస్‌ చేర్చలేదు చేర్చలేదు. సీతారాం లాంటి ఓబీసీ నేతను కాంగ్రెస్‌ అవమానించింది. నెహ్రూ ఘనతను పెంచడం కోసం అంబేద్కర్‌ను శ్యామ్‌ పిట్రోడా అవమానించారు. 1990లో కేంద్రంలో మా మద్దతుతో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను ‘భారతరత్న’తో సత్కరించింది’’.   గిరిజన రాష్ట్రపతిని కాంగ్రెస్‌ వ్యతిరేకించి అవమానపర్చింది. తొలిసారి ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేసింది ఎన్డీయే ప్రభుత్వం. సామాజిక న్యాయంపై కాంగ్రెస్‌ ఇప్పుడు పాఠాలు చెబుతుండడం విచిత్రంగా ఉంది..

పదేళ్ల క్రితం 120 ఏకలవ్య స్కూల్స్ ఉండేవి...ఇప్పుడు 400కి పైగా ఏకలవ్య స్కూల్స్ ఉన్నాయి. సబ్ కా సాత్ సబ్ కా వికాస్...ఇది మోదీ గ్యారెంటీ. ఇది మోదీ గ్యారంటీ కాలం....నవభారత నిర్మాణానికి ఇది నాంది. గ్యారంటీ ఇవ్వని వాళ్ల దుకాణాలు బంద్ అవుతున్నాయి. నిరాశావాదాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింపజేయడమే కాంగ్రెస్ అజెండా. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసినట్టు మాపై అసత్య ప్రచారం చేశారు. 

నేను స్వతంత్ర భారతంలో పుట్టాను...నా ఆలోచనలు కూడా స్వతంత్రంగా ఉంటాయి. బానిసత్వానికి నేను పూర్తిగా వ్యతిరేకం. బీఎస్‌ఎన్‌ఎల్‌, హాల్‌(HAL), ఎంటీఎన్‌ఎల్‌(MTNL), ఎయిర్‌ ఇండియా AIR INDIA లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ సర్వనాశనం చేసింది. ఇప్పుడు BSNLను పటిష్టం చేసి 5G తీసుకొచ్చాం. HAL కూడా లాభాల్లో నడుస్తోంది. LIC మూతపడుతుందని కాంగ్రెస్ పుకార్లు పుట్టించింది....ఇప్పుడు LIC షేర్ ధర రికార్డ్ స్థాయికి చేరుకుంది. షేర్ మార్కెట్ రికార్డ్ స్థాయిలో లాభాలు ఆర్జిస్తోంది. ప్రభుత్వరంగ ఆస్తులను రూ.9 లక్షల కోట్ల నుంచి రూ.75 లక్షల కోట్లకు పెంచాం.  కాంగ్రెస్ పార్టీని స్టార్టప్‌లాగా యువరాజు రాహుల్ నడిపిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పదే పదే ఒకే ఉత్పత్తి (రాహుల్‌ను ఉద్దేశిస్తూ)ని ఆవిష్కరించాలని ప్రయత్నిస్తోంది. అందుకే వారి దుకాణం మూతబడుతోంది. వారు తమ యువరాజును స్టార్టప్‌గా తీసుకురావాలని భావిస్తున్నారు. కానీ, ఆయన కనీసం దేన్నీ స్టార్ట్‌ చేయడు కానీ ఆ కంపెనీ స్టార్ట్ కావడం లేదు.  

దేశం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి....రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రాలకు కావాల్సినన్ని నిధులు ఇస్తాం. ఫెడరలిజానికి నా మద్ధతు ఉంటుంది. నేను సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాగే పనిచేశా. కరోనా కాలంలో సీఎంలతో 20సార్లు సమావేశమయ్యా. కరోనా ముందు ప్రపంచం ఓడినప్పటికీ....భారత్ గెలిచింది. ఇందులో రాష్ట్రాలు కూడా కీలక పాత్ర పోషించాయి. భారత్ గొప్పతనం ఢిల్లీలో కాదు...మారుమూల ప్రాంతంలో ఉంది. అందుకే జీ-20 సమావేశాలను భారత్ లోని అనేక ప్రాంతాల్లో నిర్వహించాం

నిధులు రావడం లేదని ఢిల్లీలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ధర్నాకు దిగవడం నాకు బాధ కలిగించింది. మాకు రాష్ట్రాల పై వివక్ష లేదు. దక్షిణ భారతం కావాలని ధర్నా చేస్తారా?. దేశం అంటే మన దేహం లాంటిది....అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాం. బొగ్గు మా రాష్ట్రంలో ఉంది.. మేమే వాడుకుంటామంటే నడుస్తుందా?. నదులు మా రాష్ట్రంలో ఉన్నాయి జలాలు మేమే వాడుకుంటామంటే కుదురుతుందా?. మా రాష్ట్రం మా ట్యాక్స్ అంటారు...ఇదెక్కడి వితండవాదం?. దేశం అంటే మన దేహం లాంటిది
దేశాన్ని విభజించే కుట్రలను సహించే ప్రసక్తే లేదు. 

ఉచిత రేషన్ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తాం. ఆయుష్మాన్ భారత్ పథకం ఎప్పటికి ఉంటుంది...ఇది మోదీ గ్యారంటీ. కిసాన్ సమ్మాన్ నిధి, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. త్వరలో 3.0 వస్తుంది అని ప్రధాని మోదీ తన ప్రసంగం ముగించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement