
ఢిల్లీ: సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన జనం,కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఓ అగంతకుడు దాడికి పాల్పడిన దేశ రాజధానిలో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కమిషనర్ ఎస్‌బీకే సింగ్‌ను తొలగించింది. ఆయన స్థానంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా సతీష్ గోల్చాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హోం గార్డ్స్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఎస్‌బీకే సింగ్ ఆగస్టు 1న ఢిల్లీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. స్వల్ప వ్యవధిలోనే సీఎం రేఖా గుప్తాపై నిందితుడు దాడికి పాల్పడడంతో ఢిల్లీ ప్రభుత్వం ఎస్‌బీకే సింగ్‌ను విధుల నుంచి తప్పించింది.