breaking news
Delhi Police Commisioner
-
సీఎం రేఖా గుప్తాపై దాడి.. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌పై బదిలీ వేటు
ఢిల్లీ: సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన జనం,కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఓ అగంతకుడు దాడికి పాల్పడిన దేశ రాజధానిలో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కమిషనర్ ఎస్బీకే సింగ్‌ను తొలగించింది. ఆయన స్థానంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా సతీష్ గోల్చాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హోం గార్డ్స్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఎస్బీకే సింగ్ ఆగస్టు 1న ఢిల్లీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. స్వల్ప వ్యవధిలోనే సీఎం రేఖా గుప్తాపై నిందితుడు దాడికి పాల్పడడంతో ఢిల్లీ ప్రభుత్వం ఎస్బీకే సింగ్‌ను విధుల నుంచి తప్పించింది. -
'ఆ యువతిని అరెస్ట్ చేశాం'
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఇంకు చల్లిన యువతిని అరెస్ట్ చేశామని, ఆమెపై కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. కేజ్రీవాల్ కు తగిన సదుపాయాలు, భద్రత కల్పించామని ఆయన చెప్పారు. సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... కేజ్రీవాల్ పై ఇంకు దాడి ఘటనకు సంబంధించి చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తమపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేజ్రీవాల్‌పై ఆదివారం భావన అరోరా(26) అనే యువతి ఇంకు చల్లింది. ఢిల్లీలో సరి-బేసి వాహన విధానం విజయవంతం కావడంపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తుండగా, వేదికకు దగ్గరగా వెళ్లిన ఆమె ఇంకుతో దాడికి పాల్పడింది. కాగా, కేజ్రీపై ఇంకు దాడిలో బీజేపీ కుట్ర ఉందని, ఢిల్లీ పోలీసులూ భాగస్వాములని మనీశ్ సిసోడియా ఆరోపించారు. సరి-బేసి విధానం విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక, మనుషుల్ని చంపేందుకూ వెనకాడబోరని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.