కడియంను ఓడించాలనే కసి మీలో కనిపిస్తోంది: హరీశ్‌రావు | BRS Harish Rao slams on Kadiyam Srihari Hanamkonda | Sakshi
Sakshi News home page

కడియం వెన్నుపోటు బ్రాండ్‌.. ఓడించాలనే కసి మీలో కనిపిస్తోంది: హరీశ్‌రావు

Apr 1 2024 1:42 PM | Updated on Apr 1 2024 2:49 PM

BRS Harish Rao slams on Kadiyam Srihari Hanamkonda - Sakshi

ఎన్టీఆర్‌, చంద్రబాబు, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం శ్రీహరి’ హరీశ్‌ రావు నిప్పులు చెరిగారు.

సాక్షి, హన్మకొండ: కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లిపోయాక పార్టీలో జోష్‌ పెరిగిందని, ఆయనకు గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనిపిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. బీఆర్ఎస్ వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో హరీశ్‌ రావు కడియంపై మండిపడ్డారు. 

‘కడియంకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చింది బీఆర్‌ఎస్‌. కడియంపార్టీ ఎందుకు మారారో చెప్పాలి. కాంగ్రెస్‌లో కడియం ఇంకో గ్రూప్‌ పెడతారా?. ఎన్టీఆర్‌, చంద్రబాబు, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం శ్రీహరి’ హరీశ్‌ రావు నిప్పులు చెరిగారు. తనకు కుమార్తెకు ఎంపీ టికెట్‌ అడిగి.. చివరి నిమిషంలో బీఆర్‌ఎస్‌కు ద్రోహం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా  చేయాలని హరీష్‌ కోరారు.

జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కావ్య  మా నాన్న(కడియం) బ్రాండ్‌ అంటోంది.. వెన్నుపోటు పొడవ​టంలోనా బ్రాండా? ఎన్టీఆర్‌, చంద్రబాబు, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం. ఆరూరి​ రమేష్‌, పసునూరి దయాకర్‌ను వెళ్లగొట్టిందే కడియం. కడియం లాంటి ద్రోహులను ప్రజలు క్షమించరు. కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి’అని పల్లా మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement