బీఆర్‌ఎస్ సభకు కుమారస్వామి, నితీష్ కుమార్ ఎందుకు రాలేదు?: బండి సంజయ్ సూటి ప్రశ్న

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ (Cm Kcr) చేసిన వ్యాఖ్యలను బండి తీవ్రంగా వ్యతిరేకించారు. బీఆర్‌ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ సభకు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రైతులకు రైతుబంధు పేరిట సాయం అందజేసి సబ్సీడీలను తెలంగాణ సర్కార్ ఎత్తేసిందని మండిపడ్డారు.
దేశంపై కేసీఆర్ ద్వేషం పెంచుకున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. అగ్నిపథ్ గురించి కేసీఆర్ ఒక్కసారైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. అగ్నిపథ్ అనేది బిపిన్ రావత్ సూచించారని, ఆయన కంటే ఎక్కువగా కేసీఆర్‌కు అగ్నిపథ్ గురించి తెలుసా? అని నిలదీశారు. ప్రాజెక్టులు ఎలా కడతారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ గ్రామంలో 24 గంటలు కరెంట్ ఉంటుందో చెప్పాలని బండి సూటిగా ప్రశ్నించారు.
చదవండి: జగిత్యాలలో టెన్షన్ టెన్షన్.. మాస్టర్ ప్లాన్‌ను నిరసిస్తూ అష్టదిగ్భందనం
మరిన్ని వార్తలు :