లోకేష్‌ను డైరెక్ట్‌ చేస్తోందెవరు? | Balakrishna Ignored Nara Lokesh Under TDP Seniors Wrong Direction | Sakshi
Sakshi News home page

లోకేష్‌ను డైరెక్ట్‌ చేస్తోందెవరు? యెల్లో మీడియా ఎందుకు డీగ్రేడ్‌ చేస్తోంది?

Sep 28 2023 2:09 PM | Updated on Sep 28 2023 2:44 PM

Balayya Ignored Nara Lokesh Under TDP Seniors Wrong Direction - Sakshi

లోకేష్‌ను అయోమయానికి గురి చేస్తున్న సీనియర్లు

ఓవైపు భయపెడుతూనే.. మరోవైపు పోరాడాలంటూ క్లాసులు

లోకేష్‌ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్న యెల్లో మీడియా

లోకేష్‌ కంటే బ్రహ్మణినే కరెక్ట్‌ అంటూ కథనాలు

తండ్రి అరెస్ట్‌తో ఢీలా పడిపోయిన నారా లోకేష్‌లో.. స్కిల్‌స్కాంతో పాటు ఇన్నర్‌రింగ్‌ కేసులో దర్యాప్తు సంస్థ అభియోగాలతో  భయం మరింతగా పెరిగిపోయింది. ఎక్కడ ఏపీకి వస్తే అరెస్ట్‌ చేస్తారో అనే భయంతోనే ఢిల్లీని వదిలి రావట్లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇలాంటి టఫ్‌ టైంలో లోకేష్‌కు మనోధైర్యం అందించాల్సిన టీడీపీ పెద్దలు కొందరు.. మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. కొందరు పిరికిమందు నూరిపోస్తుంటే.. మరికొందరు జైలుకు పోయిన ఫర్వాలేదంటూ ముందుకు నెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ దశలో ఎటూ పాలుపోని స్టేజ్‌లో ఉన్న చినబాబును.. ఎల్లో మీడియా కూడా టార్గెట్‌ చేసింది. కనీస నైతిక మద్దతుగా నిలవకుండా కథనాలు ఇస్తూ డీగ్రేడ్‌ చేస్తోంది. 

చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్న  లోకేష్‌ .. తండ్రి కోసం న్యాయపరమైన, రాజకీయ మంతనాలు అంటూ ఢిల్లీకి చెక్కేశారు. ఒకట్రెండు రోజులు పార్టీ సమావేశాల పేరుతో చంద్రబాబు కుర్చీలో కూర్చుని హడావిడి చేశారు నందమూరి బాలకృష్ణ. ఆ తర్వాత ఆయన తెర మీద కనిపించింది లేదు. ప్రస్తుతం షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారనే సమాచారం. ఇక.. జైలులో ములాఖత్‌ అయిన జనసేన పవన్‌ కల్యాణ్‌, పొత్తు ప్రకటన చేస్తూనే వారాహికి సిద్ధమయ్యాడు. ఈ గ్యాప్‌లో మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. పార్ట్‌టైం రాజకీయాలతో బాబు అరెస్ట్‌ను వీళ్లే పట్టించుకోనప్పుడు.. మనకెందుకులే అని టీడీపీ ముఖ్యనేతలు అనుకుంటున్నారు. అందుకే పరిస్థితులపై మొక్కుబడి సమీక్షలు నిర్వహించడం లేదు. ఫలితంగానే.. దిశానిర్దేశానికి బదులు  లోకేష్‌ను అయోమయంలోకి నెట్టేస్తున్నారు. 

యువగళానికి మంగళమా?
ఢిల్లీలోనే ఉండిపోవాలన్నది నారా లోకేష్‌ సొంత నిర్ణయమా?. పూర్తిగా కాదనే సంకేతాలు అందిస్తూ.. యెల్లో మీడియానే కథనాలు ప్రచురించడం గమనార్హం. పరిస్థితులు చక్కబడేదాకా(ముందస్తు బెయిల్‌ దొరకడమో లాంటి పరిణామం) యువగళం పాదయాత్ర చేపట్టే ఆలోచనను పక్కనపెట్టాలని, హస్తినకే పరిమితం కావాలని లోకేష్‌కు టీడీపీలోని కొందరు పెద్దలు సూచించారట. అందుకు లోకేష్‌ సైతం సై అన్నట్లు తెలుస్తోంది.  ఈ మేరకు యువగళం పాదయాత్ర వాయిదా వేస్తున్నారంటూ ఎల్లో మీడియాలో బ్రేకింగ్‌ల మీద బ్రేకింగ్‌ న్యూస్‌లతో లీకులు కనిపిస్తున్నాయి. యువగళం ఎప్పటిదాకా వాయిదా అనేదానిపై స్పష్టత.. సరైన కారణం ఏంటన్నదానిని చర్చించకుండానే ఆ వార్తలు యెల్లో మీడియా పబ్లిష్‌ చేయడం గమనార్హం. అయితే ఆ టీడీపీ పెద్దలను సైతం యెల్లో మీడియా బయటపెట్టడం లేదు. 

లోకేష్ దమ్ముపై అనుమానాలే!
ఢిల్లీలో ఉండిపోయిన నారా లోకేష్‌ తీరుపై టీడీపీ క్యాడర్‌లో కోపం పెరిగిపోతోంది. యువగళంతో ఇప్పటిదాకా వచ్చిన క్రెడిట్‌ అంతా పొగొట్టుకుంటున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హార్డ్‌కోర్‌ లోకేష్‌ అభిమానులు.పైగా ఏపీ నుంచి ఢిల్లీ పారిపోయారన్న అపఖ్యాతి మూటగట్టుకోవద్దంటూ సూచిస్తున్నారు. ఈ తరుణంలో.. ఏపీకి వస్తే లోకేష్‌కు ఎదురయ్యే పరిస్థితులు ఏంటి?.. దానిని ఎదుర్కొనే దమ్ము లోకేష్‌లో ఎంత ఉంది?..  అసలు యువగళంతో అనుకున్న మైలేజ్‌ లోకేష్‌కి వచ్చిందా? జనాలు లోకేష్‌ గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నల ఆధారంగా రెండు వర్గాలుగా విడిపోయారు టీడీపీ సీనియర్లు.

పాదయాత్రను కనీసమైన వారం పాటు వాయిదా వేయాలి. ముందస్తు బెయిల్‌ వచ్చే వరకు లోకేష్‌ను ఢిల్లీలోనే ఉండమనాలి. ఇన్నాళ్లు లోకేష్‌ను లీడర్‌గా ప్రచారం చేసి ఇప్పుడు వెనక్కు జరిపితే క్యాడర్‌ మనోస్థైర్యం దెబ్బ తింటుంది.. ఇది ఓ వర్గం చేస్తున్న వాదన.  అయితే.. పాదయాత్ర నిలిపివేస్తే పరువు గోవిందా? అని మరో వర్గం వాదిస్తోంది.  ముందయితే ఎలాగైనా లోకేష్‌ను బుజ్జగించి రాజమండ్రికి రప్పించాలని, ఒకవేళ లోకేష్ అరెస్ట్ అయితే కనీసం అలాగైనా సింపథీ వస్తుందని చెబుతోంది మరో వర్గం.  

నాన్నగారికే లేదు.. 
ఢిల్లీలో ఇంతకు ముందు చేసిన ప్రకటన ప్రకారం.. రేపు(శుక్రవారం) రాత్రి నుంచి నారా లోకేష్‌ పాదయాత్ర జరగాలి. కానీ, చినబాబును అరెస్ట్‌ భయం వీడడం లేదు. పైగా పాదయాత్ర మధ్యలో నిలిపివేస్తే పరువు పోతుందని భయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే తన తండ్రి అరెస్ట్‌కే రాని సానుభూతి.. తన విషయంలో వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట లోకేష్‌. అందుకే అక్కడి నుంచి కదలడం లేదన్న టాక్‌ నడుస్తోంది టీడీపీలో.

యెల్లో మీడియా కూడా.. 
ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. యెల్లో మీడియా సైతం లోకేష్‌ మానసిక స్థైర్యాన్ని మరింతగా దిగజారుస్తోంది. ఉమెన్‌ ట్రంప్‌ కార్డు కథనాలతో లోకేష్‌ను తక్కువ చేసి చూపిస్తోంది. లోకేష్‌ గనుక అరెస్ట్‌ అయితే.. ఆయన భార్య నారా బ్రాహ్మణితో పాదయాత్ర చేయించాలని బాబు అరెస్ట్‌ టైం నుంచే ఊదరగొడుతోంది. ఎందుకంటే..  లోకేష్‌ కంటే బ్రాహ్మణి బరిలో దిగితే ఎక్కువ మైలేజ్‌ వస్తుందట.  నారా+నందమూరి కుటుంబాలకు వారసురాలిగా గుర్తింపు వస్తుంది అంటూ వాదిస్తోంది. ఈ కథనాలకు చినబాబు సైతం అంతే చిన్నబుచ్చుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement