- ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చమూకల దాడులు..
- వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా రెచ్చిపోయన టీడీపీ గూండాలు
- ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ.. పేట్రేగిపోయిన కూటమి నేతలు
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ రిగ్గింగ్‌కు పాల్పడింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల అధికారులను, పోలీసులను తమ చేతుల్లో పెట్టుకుని.. ఎక్కడికక్కడ రౌడీ మూకలను దింపి మరీ ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. ఘర్షణలు, దాడులతో ఏపీలో అత్యధిక శాతం పోలింగ్ సెంటర్లు అట్టుడికిపోయాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులే లక్ష్యంగా పచ్చమూకలు చెలరేగి పోయాయి.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గూండాలు రెచ్చిపోయి పోలింగ్ జరగకుండా అడ్డుకోవడంతో పాటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై అమానుషంగా ప్రవర్తించిన ఘటనలు వెలుగుచూశాయి. ప్రజాస్వామ్యం కనుమరుగైపోయి, పోలింగ్ సెంటర్లే కన్నీళ్లు పెట్టుకునేలా పచ్చమూకలు రౌడీయిజం కొనసాగింది.
కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఉద్రిక్తతలు.. ఘర్షణలు, దాడులు రౌండప్..
- చిలకలూరిపేట: 28వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చిన్నం లలిత కుమారుడు చిన్నం వెంకటేష్‌ను అర్ధరాత్రి 12.30 గంటలకు పోలీసులు అరెస్టు చేశారు.
- చిలకలూరిపేట: 27వ వార్డు అభ్యర్థి అన్నపురెడ్డి శ్రీలక్ష్మి కోసం అర్ధరాత్రి పోలీసులు ఇంటికి వెళ్లారు. ఆమె ఆచూకీ చెప్పాలంటూ బంధువులను బెదిరించారు.
- చిలకలూరిపేట: వెంకటేష్, చల్లా శ్రీను, దొడ్డా రాకేష్ గాంధీ తదితరులను అర్ధరాత్రి 12.30 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- చిలకలూరిపేట 4వ వార్డు: అభ్యర్థి కవల నాగయ్య కుమారుడు కవల దినకర్‌ను పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
- చిలకలూరిపేట 6వ వార్డు: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ సుభానీతో పాటు ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు.
- చిలకలూరిపేట 14వ వార్డు: వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగి, పోలింగ్ కేంద్రం తలుపులు మూసి టీడీపీ శ్రేణులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.
- చిలకలూరిపేట 17వ వార్డు: జనసేనకు చెందిన పెంట్యాల బాలాజీ ఇతర ప్రాంతాల వ్యక్తులతో వచ్చి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఏజెంట్లపై దాడికి దిగారు. రీపోలింగ్ నిర్వహించాలని స్థానికులు ఆందోళనకు దిగారు.
- చిలకలూరిపేట 27వ వార్డు: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అన్నపురెడ్డి శ్రీలక్ష్మిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు. ఆమెను అడ్డుకోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు.
- చిలకలూరిపేట 32వ వార్డు: సుభానీనగర్ కమ్యూనిటీ హాల్ పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లను, అభ్యర్థిని బయటకు పంపి బెదిరించారు.
- చిలకలూరిపేట 40, 41, 44వ వార్డులు: వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను కేంద్రాల్లోకి అనుమతించకుండా టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు.
- మాచర్ల: 36 వార్డుల్లో టీడీపీ ఏజెంట్లు ఓటర్ల నుంచి బ్యాలెట్ పత్రాలు తీసుకుని సైకిల్ గుర్తుకు ఓట్లు వేసుకున్నారు.
- మాచర్ల: మొత్తం 71 పోలింగ్ బూత్‌లలో ఓటర్లను బెదిరిస్తూ బ్యాలెట్ స్లిప్పులు లాక్కుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.
- మాచర్ల 31వ వార్డు: బయట ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, వారిని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేయడంతో ఒకరికి గాయాలయ్యాయి.
- మాచర్ల 23వ వార్డు: పశువుల ఆస్పత్రి సమీపంలోని ఎంపీయూపీ పాఠశాల పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు.
- మాచర్ల 32వ వార్డు: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ ఆషా భర్త షేక్ మస్తాన్‌ను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఆచూకీ కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు.
- మాచర్ల 22వ వార్డు: అభ్యర్థి వందన కుమార్ సోదరుడు మాచర్ల సుందర్‌రావును పోలీసులు అరెస్టు చేశారు.
- మాచర్ల: 80 ఏళ్ల వెంకట్‌రెడ్డి చేతిలోని ఓటు స్లిప్పును లాక్కుని, ఓటు వేయనీయకుండా బయటకు పంపించారు.
- సత్తెనపల్లి: 12వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దింటి గోవిందమ్మ భర్త వెంకటేశ్వర్లును అర్ధరాత్రి పోలీసులు తీసుకెళ్లారు. కుమారుడు దీప్‌చందును మాస్కులు ధరించిన నలుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు.
- సత్తెనపల్లి: మండల పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేయకపోతే పింఛన్ తొలగిస్తామని టీడీపీ నాయకులు బెదిరించారు.
- సత్తెనపల్లి: వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై ఎస్‌ఐ గోపి దాడి చేశారు.
- వినుకొండ 8వ వార్డు: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోలూరు అర్చనమూర్తి, ఆమె భర్త నరసింహమూర్తిపై పోలింగ్ కేంద్రం వద్ద దాడి చేశారు.
- వినుకొండ: 2, 5, 8, 12, 19, 20, 35, 36 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు లాగి దాడులు చేశారు.
- వినుకొండ 5వ వార్డు: పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న కొత్త కోటేశ్వరరావును బూత్ నుంచి బయటకు పంపించారు.
- గుంటూరు 9వ డివిజన్: రైలుపేట గొలుసు నాంచారమ్మ హైస్కూల్ వద్ద టీడీపీ అభ్యర్థి పోతురాజు సమత, జనసేన రెబల్ అభ్యర్థి నామా శశికాంత్ వర్గాల మధ్య వివాదంలో పోలీసులు లాఠీచార్జి చేశారు.
- గుంటూరు 33వ డివిజన్: ఏటీ అగ్రహారం ఎస్‌కేబీఎం హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారన్న అభ్యంతరంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం. గుర్తింపు కార్డులు లేని వారిని పోలీసులు బయటకు పంపించారు.
- గుంటూరు 46వ డివిజన్: ఓటు వేసిన తర్వాత వేలికి ఉన్న సిరాను తుడుచుకుని మళ్లీ దొంగ ఓట్లు వేసేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు.
- గుంటూరు 57వ డివిజన్: ఐదో పోలింగ్ బూత్‌లో టీడీపీ శ్రేణులు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శ్రీదేవిపై దాడి చేసి ఏజెంట్‌ను కొట్టడంతో పాటు బ్యాలెట్ బాక్స్‌ను ధ్వంసం చేశారు.
- గుంటూరు 59వ డివిజన్: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ధనావత్ వెంకటేశ్వర్లు నాయక్‌పై దాడి జరిగింది.
- గుంటూరు 61వ డివిజన్: పోలింగ్ ముగిసిన తర్వాత వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బోడపాటి కిషోర్, మాజీ కార్పొరేటర్ బోడపాటి ఉషారాణిపై దాడి చేశారు.
- గుంటూరు 62వ డివిజన్: నవీన స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్ల ఆరోపణలతో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
- విజయవాడ 43వ డివిజన్: టీడీపీ డబ్బుల పంపిణీని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులు రాంబాబు, వెంకట్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- విజయవాడ: నిర్మలా కాన్వెంట్ పోలింగ్ కేంద్రంలో స్థానికంగా ఓటు హక్కు లేని కూటమి వ్యక్తులను ఏజెంట్లుగా నియమించారు.దీనిపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
- తెనాలి 45వ వార్డు: చివరి నిమిషంలో ఓటు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
- రేపల్లె 9వ వార్డు: పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా రిగ్గింగ్ కొనసాగిందని, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపి పీఓను బెదిరించారు.
ఇవీ చదవండి: ఎన్నికల చరిత్రలో చీకటిరోజు
మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలపై వైఎస్ జగన్ ఆగ్రహం
మహిళా అభ్యర్థితో పాటు ఆమె భర్తపై దాడి


