టీడీపీ మూకల అరాచకాలు.. మహిళా అభ్యర్థితో పాటు ఆమె భర్తపై దాడి | Municipal Poll Violence, YSRCP Alleges TDP Attacks, Booth Capturing And Mass Rigging In Vinukonda, Macherla And Chilakaluripet | Sakshi
Sakshi News home page

టీడీపీ మూకల అరాచకాలు.. మహిళా అభ్యర్థితో పాటు ఆమె భర్తపై దాడి

Nov 1 2026 4:53 PM | Updated on Nov 1 2026 5:13 PM

Situation in Palnadu district AP local body elections 2026

పల్నాడు జిల్లా: వినుకొండలో టీడీపీ మూకలు అరాచకానికి పాల్పడ్డాయి. పోలింగ్‌ కేంద్రంలోనే దాడికి దిగాయి. వినుకొండ 8వ వార్డు అర్చన మూర్తి దంపతులపై టీడీపీ నాయకుడు దాడి చేశాడు. పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు తీసుకువచ్చి కూడా టీడీపీ గూండాలు దాడి చేశారు. మహిళని కూడా చూడకుండా మొహం మీద పిడి గుద్దులు గుద్ది నెట్టేశారు.

మాచర్ల మున్సిపాలిటీలోనూ టీడీపీ రౌడీయిజం కొనసాగుతోంది. సామాన్య ఓటర్లకు కూడా బెదిరింపులు తప్పడం లేదు. 12 వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటేసేందుకు వెళ్లిన ఓటర్లను అడ్డుకుని పచ్చ గూండాలు, పోలీసులు బెదిరించారు. ‘‘మీ ఓటు మేం వేస్తాం.. వెళ్లిపో’’ అంటూ హుకూం జారీ చేశారు. కాదు కూడదు అంటే ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మాచర్ల‌ మున్సిపాలిటీలో మొత్తం 71 పోలింగ్ బూత్‌లను క్యాప్చర్ చేశారు టీడీపీ గూండాలు. 36 వార్డుల్లోని 71 పోలింగ్ బూతుల్లో మాస్ రిగ్గింగ్‌కు పాల్పడుతోన్న పచ్చ రౌడీలు సామాన్యులకు ఓట్లు వేసే అవకాశమే లేకుండా చేస్తున్నాయి టీడీపీ కిరాయి మూకలు. ప్రతి పోలింగ్ బూత్‌ల బయట వందలాదిగా టీడీపీ గూండాలు ఉన్నారు. పోలింగ్ బూత్ లోపల మాస్ రిగ్గింగ్ జరిగింది. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. ఆరు గంటలుగా పోలీస్ స్టేషన్‌లోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఉన్నారు.

నియోజకవర్గంలోని గ్రామాల నుంచి వినుకొండకు భారీ స్థాయిలో తెలుగుదేశం గుండాలను రప్పించారు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. 10 వార్డుల్లో పోలింగ్ బూత్‌లను క్యాప్చర్ చేశారు తెలుగుదేశం గుండాలు. యథేచ్చగా రిగ్గింగ్ జరుగుతోంది. తెలుగుదేశం రౌడీలు రిగ్గింగ్ చేస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. 

పిన్నెల్లి ఆగ్రహం
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఇంట్లోనే దిగ్బంధించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి చుట్టుపక్కల ఇనుప కంచెలు, బారీకేడ్ల ఏర్పాటు చేశారు. అనుచరులు, పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులు పిన్నెల్లి ఇంటి వైపునకు రాకుండా అడ్డగించారు. ఇప్పటికే 12 మంది కౌన్సిలర్లు, పార్టీ నేతల అరెస్ట్ అయ్యారు.ఐదు గంటలుగా పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మాచర్ల మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అక్రమ అరెస్టులు సరికాదని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా చేసి, అభ్యర్థులను బూత్‌లకు రాకుండా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిణామాలపై ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. 

చిలకలూరిపేటలో తెలుగుదేశం నాయకులు అరాచకం సృష్టించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి తెలుగుదేశం గుండాలను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేటకు రప్పించారు. చిలకలూరిపేటలో ఉన్న 48 వార్డుల్లో పోలింగ్ బూత్‌లను క్యాప్చర్ చేశారు టీడీపీ రౌడీలు. వైఎస్సార్‌సీపీ ఎలక్షన్ ఏజెంట్లను బయటకు పంపించేశారు. చిలకలూరిపేటలో తెలుగుదేశం నాయకుల రిగ్గింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. పోలీసులు చేతులెత్తేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement