సాక్షి,అనంతపురం: ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. రాప్తాడు ఘటనలో నిందితుడిగా ఉన్న హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు.

అడవిలో దాక్కున్నాడనే సమాచారంతో తాము అక్కడికి చేరుకున్నామని, నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై హేమంత్ రాళ్లతో దాడి చేసి, అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించాడన్నారు పోలీసులు. ఈ క్రమంలో తాము అప్రమత్తమై ఆత్మరక్షణ కోసం నిందితుడిపై కాల్పులు జరిపామన్నారు..ఈ కాల్పుల్లో హేమంత్‌కు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రుడైన నిందితుడిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


