ఎన్నికల పేరుతో గూండాగిరీ: భూమన కరుణాకర్‌ రెడ్డి | Bhumana Karunakar Reddy Alleges Rigging And Polling Irregularities In Tirupati Municipal Elections, Demands Repolling | Sakshi
Sakshi News home page

ఎన్నికల పేరుతో గూండాగిరీ: భూమన కరుణాకర్‌ రెడ్డి

Nov 1 2026 5:32 PM | Updated on Nov 1 2026 6:01 PM

Bhumana Karunakar Reddy on ap local body elections 2026

తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారా? ఎన్నికల పేరుతో గూండాగిరీనా? అంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో జరిగిన రిగ్గింగ్, దౌర్జన్యాలు, అక్రమాలపై ఆయన స్పందించారు.

మేయర్ అభ్యర్థి గూండా JB శ్రీనివాస్, ఆయన అనుచరులు తిరుపతిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 45, 53, 57, 59, 6, 13, 42, 63, 20వ వార్డుల్లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందిందని వెల్లడించారు. 16వ వార్డులో వెబ్ కెమెరాలను పీకి పడేసిన ఘటనను తీవ్రంగా ఖండించారు. 

ఎల్‌బీనగర్, అమరావతి నగర్ ప్రాంతాల్లో కూడా వెబ్ కెమెరాలను తొలగించినట్లు భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. విధుల్లో ఉన్న పోలింగ్ అధికారులను అసభ్య పదజాలంతో దూషిస్తూ, వారిపై దాడికి ప్రయత్నిస్తూ భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ఎన్నికల ఏజెంట్లను, అభ్యర్థులను సైతం బలవంతంగా లాగిపడేసి దౌర్జన్యానికి పాల్పడ్డారని విమర్శించారు.

లోకేశ్‌ అనుచరుడిగా చెప్పబడుతున్న మేయర్ అభ్యర్థి వ్యవహారశైలి తిరుపతిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో రక్తపాతం సృష్టించే పరిస్థితులు తీసుకురావద్దని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇలాంటి చర్యలను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం పలు వార్డుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రిగ్గింగ్, వెబ్ కెమెరాల తొలగింపు, పోలింగ్ కేంద్రాల్లో జరిగిన దౌర్జన్యాల నేపథ్యంలో ప్రభావితమైన వార్డుల్లో ఎన్నికలను రద్దుచేసి, పూర్తి భద్రత పారదర్శకతతో రీపోలింగ్ నిర్వహించాలని  భూమన కరుణాకర్‌ రెడ్డి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ‘‘తిరుపతి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఓటు హక్కును పరిరక్షించాలి. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి. అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి’’ అని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ఎస్‌ఈసీ ఆఫీసు దగ్గర వైఎస్సార్‌సీపీ నేతల బైఠాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement