టీడీపీది వికృత క్రీడ: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

AP Govt Chief Whip Gadikota Srikanth Reddy Comments On Chandrababu - Sakshi

చంద్రబాబు ప్లాన్‌ ప్రకారం రెచ్చగొడుతున్నారు..

రాష్ట్రంలో టీడీపీ రాజకీయ ఉనికి కోల్పోయిందని

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

సాక్షి, కడప: రాష్ట్రంలో టీడీపీ రాజకీయ ఉనికి కోల్పోయిందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు డైరెక‌్షన్‌లో అంతా జరిగిందని.. ముఖ్యమంత్రిపై కుట్ర ప్రకారమే పట్టాభితో అనుచిత వ్యాఖ్యలు చేయించారన్నారు. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేసుకోవచ్చు. టీడీపీలో హుందాతనం కరువైందన్నారు. పట్టాభి వ్యాఖ్యలు ఏరకంగా ఉన్నాయో ప్రజలు గమనించాలన్నారు. (చదవండి: బూతు పురాణం)

‘‘చంద్రబాబు ప్లాన్‌ ప్రకారం రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు ఆకస్మికంగా ఏపీకి ఎందుకు వచ్చారు? చంద్రబాబు వైఖరి దారుణం. టీడీపీది వికృత క్రీడ. పట్టాభితో నీచాతి నీచంగా మాట్లాడించారు. ప్రజల్లో కోపం వస్తుందని చంద్రబాబుకు తెలుసు. పట్టాభి వాడిన పదాలకు అర్థమేమిటో తెలుసా?. చంద్రబాబు హయాంలో ఎవరిని అడిగినా వెన్నుపోటు, కుట్రే అంటారు. రెండున్నరేళ్లలో సీఎం జగన్‌ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అందించారని’’ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

సీఎం జగన్‌ ప్రజాస్వామ్య విలువలు కాపాడుతున్నారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని సీఎం ఆదేశించారు. నీచ రాజకీయాలు చేసేదే చంద్రబాబు. పబ్లిసిటీ కోసం ఆయన దేనికైనా తెగిస్తారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి క్షమాపణ చెప్పాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

చదవండి: బాబు ఆస్థానం.. అవినీతి ప్రస్థానం: కుప్పంలో అడ్డగోలు దోపిడీ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top