టీడీపీ మరో కుట్ర.. ఆ ప్రచారం నమ్మొద్దు | AP Ex-Minister Kodali Nani Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

టీడీపీ మరో కుట్ర.. ఆ ప్రచారం నమ్మొద్దు

Aug 18 2022 3:39 PM | Updated on Aug 19 2022 5:57 PM

AP Ex MP Kodali Nani Comments On Chandrababu - Sakshi

టీడీపీ నేతలు ప్రతీరోజూ ఏదో ఒక కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుల, మతాల పేరుతో చంద్రబాబు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ నేతలు ప్రతీరోజూ ఏదో ఒక కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుల, మతాల పేరుతో చంద్రబాబు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఆయనకు తోడు ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ‘‘గోరంట్ల మాధవ్‌పై ఫేక్‌ వీడియో ప్రచారం చేశారు. ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ అంటూ మరో కుట్ర చేశారు. గోరంట్ల వీడియోపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫేక్‌ వీడియోతో పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకే టీడీపీ ప్రయత్నం చేస్తోందని’’  కొడాలి నాని మండిపడ్డారు.
చదవండి: ఆ ఫోరెన్సిక్‌ రిపోర్టులో వాస్తవాలు లేవు: సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌

‘‘వీడియో మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేశారు. ఫేక్‌ డాక్యుమెంట్‌ను స్పష్టించి దుష్ప్రచారానికి తెరలేపారు. మహిళలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు రాజకీయంగా దిగజారిపోయారు. తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీకి ప్రజలు మళ్లీ బుద్ధి చెబుతారు. తన రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారు. ఓ జిల్లాకు బిఆర్‌ అంబేద్కర్‌ పేరు పెడితే తప్పేముంది. పవన్‌ కల్యాణ్‌ రెండు చోట్లా ఓడిపోయినా బుద్ధి రాలేదు. పవన్‌.. చంద్రబాబుకు భజన చేస్తున్నారు. టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని’’ కొడాలి నాని అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement