AP: పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Today Political News Updates And Headlines On Jan 26th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political News Jan 26th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Jan 26 2024 6:59 AM | Updated on Feb 4 2024 5:02 PM

AP Elections Political News Updates Headlines 26th Jan 2024 Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

7:30PM, Jan 26, 2024

పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య మరోసారి బయటపడ్డ విభేదాలు 

  • ఉప్పాడలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జయహో బీసీల సమావేశం
  • తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ జనసేన నేతల ఆందోళన
  • మాజీ ఎమ్మెల్యే వర్మను నిలదీసిన జనసేన నాయకులు
  • టీడీపీ కార్యక్రమం అంటూ వర్మ సమాధానం చెప్పడంతో మండిపడుతున్న జనసేన
  • ఇక్కడి పరిణామాలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామంటున్న జనసేన

7:15PM, Jan 26, 2024

పవన్ కామెంట్లపై బోండా ఉమ రియాక్షన్

  • టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలావరకు ఫైనల్ అయింది 
  • పవన్‌కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది, ప్రకటించారు 
  • జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారు
  • పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారు

06:01PM, Jan 26, 2024

పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావుపై ఆరోపణలు

  • నోవా అగ్రిటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ  ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు నిర్ధారణ
  • పావులూరు గ్రామంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రూ. 2లక్షల 39 వేల నగదు పంపిణీ చేసినట్లు గుర్తింపు
  • దుద్దుకూరు గ్రామంలో రూ. 15 లక్షలు పంచినట్లు నిర్ధారణ
  •  డబ్బు పంపిణీకి నోవా అగ్రిటెక్‌ కంపెనీ ఉద్యోగులు అప్పారావు, బుజ్జిబాబు, సాయి గణేష్‌లను ఉపయోగించినట్లు గుర్తింపు

3:50 PM, Jan 26, 2024

అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నోటీసులు

  • 29న వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని నోటీసులు
  • ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్‌ తమ్మినేని
  • ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ చేసిన మండలి చైర్మన్‌

3:45 PM, Jan 26, 2024

పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేసిన వ్యక్తి  సీఎం జగన్‌: పేర్ని నాని

  • రాష్ట్రవ్యాప్తంగా 75 ఎకరాలు కొనుగోలు చేసి  31  లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం  జగన్‌కు పేదల మీద ఉన్న ప్రేమ
  • రాష్ట్రవ్యాప్తంగా విద్యాభివృద్ధికి  70 వేల కోట్లు   ఖర్చు చేశారు
  • చదువు బాధ్యత ప్రభుత్వంది కాదని చంద్రబాబు అన్నారు 
  • గతంలో చంద్రబాబు మాట్లాడిన వీడియో నా దగ్గర ఉంది...  కావాలంటే ఇస్తా
  • గత ప్రభుత్వం 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నిర్వచలేదని  విమర్శించారు
  • సీఎం జగన్‌  చేసిన అభివృద్ధి చూసి ఓట్లు వేయండి .
  • మీ మనస్సాక్షిని  అడిగి ఓట్లేయండి

3:35 PM, Jan 26, 2024
శింగనమల టీడీపీ నేత బండారు శ్రావణికి ఎదురుదెబ్బ

  • శింగనమల నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జి ఎవరూ లేరని ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ జోనల్ ఇంఛార్జి బీద రవిచంద్ర
  • ఇప్పటిదాకా శింగనమల టీడీపీ అభ్యర్థిని ప్రకటించలేదన్న బీద రవిచంద్ర
  • శింగనమల నియోజకవర్గంలో టూమెన్ కమిటీ ఆధ్వర్యంలో మాత్రమే కార్యక్రమాలు జరుగుతాయని స్పష్టం చేసిన బీద రవిచంద్ర
  • కొంతకాలంగా శింగనమల ఇంఛార్జి తానేనంటూ ప్రచారం చేస్తుకుంటున్న బండారు శ్రావణి
  • గత ఎన్నికల్లో ఓటమి పాలైన బండారు శ్రావణి
  • మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ జోనల్ ఇంఛార్జి బీద రవిచంద్ర ప్రకటనతో కంగుతిన్న బండారు శ్రావణి వర్గం

1:45 PM, Jan 26, 2024
జనసేన, టీడీపీకి మంత్రి కొట్టు సత్యనారాయణ కౌంటర్‌

  • చంద్రబాబుతో పవన్‌ పొత్తు పెట్టుకున్నపుడే ఇది ఒక అపవిత్ర పొత్తు అని ప్రజలు తేల్చేశారు. 
  • పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించాడు.
  • ప్రజలను మోసం చేసి పేరు తెచ్చుకున్న చంద్రబాబుతో పవన్ జతకట్టి తప్పుచేశాడు.
  • వాళ్లలో వాళ్లు ఒప్పందాలు పాటించకుండా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.
  • ధర్మం పక్షాన ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన వారికి ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు.
  • పొత్తులు చివరి వరకు వెళ్ళేదాకా చూడాల్సిందే.
  • మా పరిపాలన నచ్చితేనే ఓటు వేయమని అడుగుతున్నాం. 
  • మరి చంద్రబాబు ఏ రకంగా ఓటు అడుగుతాడు
  • పవన్ కళ్యాణ్ ఏమని ఓటు అడుగుతాడో చెప్పాలి.
  • జనసేన, టీడీపీ కంటున్న పగటి కలలు పగటి కలలాగానే మిగిలిపోతాయి.
  • జనసేన, టీడీపీ మోసగాళ్లను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.
  • తెలుగుదేశం హయాంలో తన వాళ్లకు ఇష్టమొచ్చినట్లు లిక్కర్ సిండికేట్లు ఇచ్చేశారు.
  • షర్మిలకు ఇంకా పరిణతి రాలేదు.
  • తెలంగాణలో పార్టీ పెట్టి నమ్మిన నాయకులను, కార్యకర్తలను గాలికొదిలేసింది.
  • ఎంత ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చి ఇప్పుడు చంద్రబాబు మాటలు వినడం చాలా దారుణంగా ఉంది.
  • వారి కుటిల రాజకీయాలకు షర్మిల బలైపోతుంది.
  • చంద్రబాబు చెప్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరని షర్మిలను రాజకీయంగా వాడుకుంటున్నారు. 
  • ఆంధ్ర రాష్ట్రానికి ఘోరమైన అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని అసలు ప్రజలు నమ్ముతారా.
  • ఆనాడు వైఎస్సార్ మృతి తరువాత ఓదార్పు యాత్రకు అహంకారంతో సోనియా గాంధీ అనుమతి ఇవ్వలేదు.
  • చంద్రబాబు ఆడుతున్న ఆటలో బలిపశువుగా షర్మిలను వాడుకుంటున్నారు.
  • చంద్రబాబు మాయమాటలు నమ్మొద్దు, ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో చాలా సంతోషంగా ఉన్నారు.

1:20 PM, Jan 26, 2024
చంద్రబాబు తోకలు ఎవరూ గెలవరు: వెల్లంపల్లి శ్రీనివాస్‌

  • ప్రతీ ఒక్కరి జీవితం బాగుండాలంటే సీఎం జగన్‌కి ఓటు వేయాలి.
  • బోండా ఉమా ఆఫీసు ఉన్న ప్రాంతంలోనే ఉమాకి మెజార్టీ రాదు
  • సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గెలవడం కలే
  • చంద్రబాబు తోకలు ఎవరూ గెలవరు
  • ఐదు సంవత్సరాలు ప్రజల వద్ద బోండా ఉమా లేడు
  • బైక్ రేస్, భూ కబ్జాలు, దొంగతనాలు, గుండాయిజం, సెక్స్ రాకెట్లు, కాల్ మనీలు చేసింది వాళ్లే
  • తుప్పు వ్యాపారం చేసే వాడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది
  • బోండా ఉమాకు సెంట్రల్ నియోజకవర్గంలో నిలబడే అర్హత లేదు
  • షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఇలా మాట్లాడటం దారుణం
  • షర్మిల అంటే మాకు గౌరవం
  • గతంలో వివేకానంద రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్లు ఇప్పుడు షర్మిలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది
  • కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఓటు, సీటు లేదు
  • రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, అప్పుల పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ
  • దివంగత వైయస్సార్ పేరును  కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్‌లో  నమోదు చేయడం దారుణం
  • సోనియా గాంధీకి తెలియకుండానే వైఎస్సార్ మీద కేసు పెట్టారా?.
  • 16 నెలలు సీఎం జగన్‌ను జైల్లో పెట్టింది వాస్తవం కాదా
  • అలాంటి పార్టీలో షర్మిల ఎలా జాయిన్ అయ్యారు
  • షర్మిల స్వార్థపరురాలు అవుతారని అనుకోలేదు

12:45 PM, Jan 26, 2024
పవన్ పనైపోయింది: అడపా శేషు కౌంటర్

  • పవన్‌ను నమ్మిన వారికి గతంలో ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతోంది 
  • 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఒక్క సీటు కూడా జనసేనకు తీసుకోలేదు
  • కాపులను పవన్ మోసం చేస్తున్నాడు 
  • పవన్ పనైపోయింది.. కాపు సోదరుల్లారా ఇప్పటికైనా మేల్కొనండి.
  • లేకపోతే మీకు రాజకీయ భవిష్యత్ ఉండదు 
  • మా నాన్నే సీఎం అన్న లోకేష్ మాటలు పవన్‌కు ఈరోజు గుర్తొచ్చాయి 
  • చంద్రబాబు ప్రొడ్యూసర్ ఐతే.. ఆ సినిమాకు పవన్ ప్యాకేజ్ స్టార్ 
  • పవన్‌కు తోడుగా ఇప్పుడు కొత్త ప్యాకేజ్ స్టార్ షర్మిల వచ్చింది
  • కొత్త ప్యాకేజ్ స్టార్ వచ్చింది కాబట్టే పవన్ మాట్లాడటం లేదు 
  • పవన్‌ను చంద్రబాబు పక్కన పెట్టేశాడు కాబట్టే టీడీపీ సీట్లు ప్రకటించుకుంటున్నాడు
  • చంద్రబాబు దగ్గర పవన్ మీకు ఒక్క సీటు కూడా ఇప్పించలేడు 
  • అందుకే చంద్రబాబు షర్మిలను తిప్పుతున్నాడు 
  • కాపులారా పవన్‌ను చూసి మోసపోకండి 
  • చంద్రబాబు, పవన్ మాటలు నమ్మకండి
  • జనసేనలోకి ఎవరొచ్చినా ప్రేమగా చూసుకుంటానంటున్నాడు కానీ.. సీట్లిస్తానని చెప్పడం లేదు 
  • చంద్రబాబు పాదాల దగ్గర కాపులను పవన్ తాకట్టు పెడుతున్నాడు 
  • పవన్‌కు సీటు ఎక్కడో ఈరోజుకీ చంద్రబాబు చెప్పలేదు
  • చంద్రబాబు వదిలేసినా పవన్ వదిలిపెట్టేలా లేడు 
  • చంద్రబాబు చెప్తేనే పవన్‌కు సీటు వస్తుంది 
  • ఒక పార్టీకి అధినేత ఎలా ఉండాలో సీఎం జగన్‌ను చూసి పవన్ నేర్చుకోవాలి 
  • పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
  • చంద్రబాబు, పవన్ దుర్మార్గపు రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు 
  • దోచుకోవడానికి అవకాశం లేదు కాబట్టే చంద్రబాబు, పవన్‌కు సీఎం జగన్‌ శత్రువులా కనిపిస్తున్నారు. 
     

12:20 PM, Jan 26, 2024
చంద్రబాబుకు అంబటి రాంబాబు కౌంటర్‌

  • పొత్తు ధర్మమే కాదు..
  • ఏ ధర్మమూ పాటించని వ్యక్తే చంద్రబాబు
  • ఇది తెలుసుకో తమ్ముడు పవన్‌ కల్యాణ్‌

12:00 PM, Jan 26, 2024
జనసేన నేతకు షాకిచ్చిన అయ్యన్నపాత్రుడు

  • టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన వాఖ్యలతో జనసేనలో టెన్షన్‌.
  • పిఠాపురం(చేబ్రోలు)లో జరిగిన బీసీ సభలో దుమారం రేపిన  అయ్యన్న పాత్రుడు వాఖ్యలు.
  • లోకల్ వర్సెస్‌ నాన్ లోకల్ అంటూ కొత్త చర్చకు తెరలేపిన అయ్యన్న
  • పిఠాపురం జనసేన ఇన్‌చార్జ్‌  తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను ఉద్దేశించి వాఖ్యలు చేసిన అయ్యన్
  • తలుపు కొడితే పలికే అభ్యర్ధి(వర్మ)కి ఓటు వేస్తారా? 
  • ఎక్కడో ఉన్న వ్యక్తి (ఉదయ్ శ్రీనివాస్) దగ్గరకు కారులో, బస్సులో వెళ్ళి తలుపుకొట్టే వారికి ఓటు వేస్తారా?
  • ఒకవేళ తలుపు కొడితే పలకరిస్తారా అంటూ జనసేన ఇన్‌చార్జ్‌పై సెటైరికల్‌ వాఖ్యలు.
  • పొత్తులో భాగంగా పిఠాపురం సీటు ఆశిస్తున్న జనసేన.
  • పిఠాపురం సీటు వర్మకే అంటూ సభలో స్పష్టం చేసిన యనమల కృష్ణుడు
  • టీడీపీ నేతల వాఖ్యలతో మండిపడుతున్న జనసేన నాయకులు

10:30 AM, Jan 26, 2024
చంద్రబాబుకు షాక్‌.. పవన్‌ సంచలన కామెంట్స్‌ 

  • టీడీపీ అభ్యర్తుల ప్రకటనపై చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని అసంతృప్తి 
  • మండపేటలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని పవన్‌ కల్యాణ్‌ తప్పుబట్టారు.
  • టీడీపీ పొత్తు ధర్మం పాటించాలి. 
  • కానీ, విస్మరించి అభ్యర్థుల్ని ప్రకటించింది. 
  • బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాంగానీ.. తీసుకునే వాళ్లం కాలేకపోతున్నాం. 
  • 50, 70 స్థానాలు తీసుకోవాలంటే  నాకు తెలియనివికావు. 
  • పవన్‌ జనంలో తిరగడు.. వాస్తవాలు తెలియని కొందరు అంటారు. 
  • తెలియకపోతే రాజకీయాల్లోకి ఎలా వస్తాను? 
  • ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం.. విడదీయడం తేలిక. 
  • అందుకే నాకు నిర్మించడం ఇష్టం 
  • జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారు. 
  • టీడీపీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు.
  • మేము కూడా ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తున్నాం
  • రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్‌ కల్యాణ్‌

10:00 AM, Jan 26, 2024
షర్మిలా.. వాస్తవాలు మర్చిపోయారా?
ఢిల్లీలో సోనియా గాంధీ నిన్ను అవమానించలేదా?
మీ కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్‌ కాదా?
ఇదంతా మర్చిపోతే ఎలా?.
 

9:30 AM, Jan 26, 2024
ఎల్లో బ్యాచ్‌ నాడు కుట్రలు.. నేడు కుతంత్రాలు

  • ఎల్లో బ్యాచ్‌కు కుట్రలు మాత్రమే తెలుసు
  • నాడు కుట్రలు, నేడు కుతంత్రాలు
  • పీక్‌ స్టేజ్‌కు గజదొంగల ఎల్లో మాఫియా ఆగడాలు 
  • దుష్టశక్తుల పన్నాగాలను మట్టుపెట్టడానికి సీఎం జగన్‌తో కలిసి యుద్ధ భేరి మోగిద్దాం.

8:00 AM, Jan 26, 2024
టీడీపీ, వైస్సార్‌సీపీకి మధ్య తేడా ఇదే..

  • చంద్రబాబు హయాంలో పేదపిల్లలకి అందని ద్రాక్షలా ప్రభుత్వ విద్య
  • కానీ, ప్రతీ పేద విద్యార్థికి నాణ్యమైన విద్య
  • పేదవాడి హక్కుగా విద్యను అందించాలన్నది సీఎం జగన్‌ ప్రభుత్వ లక్ష్యం. 

7:10 AM, Jan 26, 2024
టీడీపీ నేతల బిల్డప్‌..

  • స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతుగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా
  • నాడు బిల్డప్‌తో రాజీనామా
  • నేడు రాజీనామా ఆమోదించాక కొత్త ఏడుపు
  • స్పీకర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్తానంటూ కామెంట్స్‌
  • టీడీపీ ఎంత మాయ పార్టీనో చెప్పడానికి ఇదే బెస్ట్‌ ఉదాహరణ

7:00 AM, Jan 26, 2024
‘పొత్తు’ కడుపులో కత్తులు!

  • బాబుకు 68 సీట్ల జాబితాతో పవన్‌ ప్రతిపాదన
  • పార్టీ నేతలు, కొన్ని కుల సంఘాల ఒత్తిడితో పలు డిమాండ్లు
  • 45కు తక్కువ కాకుండా కేటాయించాలని వినతి
  • టీడీపీ బలంగా ఉన్న సీట్లు జనసేనకు ఇచ్చారన్న అభిప్రాయం కలిగించాలని సూచన 
  • అందుకే గత ఎన్నికల్లో గెలిచిన 23లో రెండైనా ఇవ్వాలని అభ్యర్థన 
  • జనసేన జాబితా బయటకు పొక్కడంతో క్షేత్రస్థాయిలో పెరిగిన విభేదాలు 
  • కత్తులు నూరుతున్న ఇరుపార్టీల నాయకులు.. సీట్ల పంపకాలపై రెండు పార్టీల్లోనూ ప్రతిష్టంభన 

6:50 AM, Jan 26, 2024
చంద్రబాబుకు కొత్త టెన్షన్‌..!

  • ‘రా కదలిరా’ సభలు కొన్ని రద్దు.. మరికొన్ని వాయిదా  
  • ఇప్పటి వరకు కష్టమ్మీద కొన్ని చోట్ల మాత్రమే సభలు 
  • ఆశించిన స్థాయిలో విజయవంతం కాక సతమతం.. జనాన్ని తరలించలేక  చేతులెత్తేస్తున్న తమ్ముళ్లు 
  • మిగిలిన చోట్ల నిర్వహించడం ఇక  కష్టమని నిర్ధారణ.. ఉరవకొండ, పీలేరులో  బుధవారం జరగాల్సిన సభలు వాయిదా 
  • గోపాలపురం సభకు బదులుగా రాజమండ్రితో సరిపెట్టే యోచన.. పార్టీ పరిస్థితి అధ్వానంగా మారడంతో బయటకు రాని నేతలు  
  • సీట్ల సర్దుబాటు తేలక జనసేన నుంచి అందని సహకారం 

6:40 AM, Jan 26, 2024
షర్మిలకు జగన్ ఏం అన్యాయం చేశారో ఆమెనే చెప్పాలి: సజ్జల

  • రాష్ట్ర రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదు
  • ఆమె వ్యాఖ్యలకు పొంతన ఉండటం లేదు
  • జగన్‌కి చెల్లెలుగా, వైఎస్సార్‌కి కూతురిగా మాత్రమే ప్రజలకు షర్మి ల తెలుసు
  • కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ ఫ్యామిలీని ఎంతగా వేధించిందీ షర్మిలకు తెలుసు
  • తనకి జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిల స్పష్టంగా చెప్పాలి
  • ప్రజాస్వామ్యంలో పదవులు అన్నీ కుటుంబానికే ఇస్తారా?
  • షర్మిల మాట్లాడిన ప్రతీదానికి సమాధానం చెప్పాల్సిన పనిలేదు
  • వైఎస్‌ జగన్‌పై కాంగ్రెస్‌ అక్రమ కేసులు పెట్టింది
  • 16 నెలలు జైల్లో పెట్టారు
  • వైఎస్సార్‌ను ప్రేమించిన ప్రతీ గుండె జగన్‌ను ఆదరించారు
  • కాంగ్రెస్‌ పెట్టింది అక్రమ కేసులని.. ఆ పార్టీ నేతలే చెప్పారు
  • జగన్‌ అంతు చూడాలని కాంగ్రెస్‌ అనేక ప్రయత్నాలు చేసింది
  • చంద్రబాబు రాయించిన స్క్రిప్ట్‌ను షర్మిల చదువుతున్నారు
  • తెలంగాణలో పార్టీ కోసం పని చేసిన వారికి షర్మిల ఏం న్యాయం చేశారు
  • తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు షర్మిలను ఎందుకు వద్దన్నారు
  • రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలు మేము గెలుస్తాం
  • 19 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ ఎలా గెలుస్తోంది
  • టీడీపీకి తగినంత సంఖ్యా బలం లేదు
  • అనర్హత వేటు అన్నది పూర్తిగా స్పీకర్‌ నిర్ణయం
  • గంటా రాజీనామా ఆమోదం స్పీకర్‌ నిర్ణయం
  • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కేంద్ర పరిధిలో ఉన్న అంశం

6:30 AM, Jan 26, 2024
చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ ఛాలెంజ్ 

  • పెనమలూరులో నా పై పోటీ చేసే దమ్ముందా?
  • చంద్రబాబు సర్వేలు కూడా చేయించుకున్నాడు
  • ఎవరు పోటీ చేసినా గెలిసేది నేనే
  • ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్‌ను ఎదుర్కోలేరు
  • ప్రతిపక్షాలను కృష్ణా నదిలో కలిపేస్తాం
  • ప్రజల గుండెల్లో జగన్ నిలిచిపోయారు
  • ఢిల్లీలో కాంగ్రెస్ పీఠాన్ని వణికించిన ధీరుడు జగన్‌మోహన్‌రెడ్డి
  • సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జగన్‌పై కుట్రలు చేస్తున్నారు
  • చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు.. కాంగ్రెస్ ముందుపోటు పొడుస్తుంది
  • 2024లో 175 స్థానాలు గెలుస్తాం
  • పెనమలూరు గడ్డ వైఎస్సార్‌సీపీ అడ్డా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement