వైఎస్‌ అవినాష్‌రెడ్డి సీరియస్‌.. పులివెందుల డీఎస్పీకి ఫోన్‌ | YSRCP MP YS Avinash Reddy Calls Pulivendula DSP | Sakshi
Sakshi News home page

వైఎస్‌ అవినాష్‌రెడ్డి సీరియస్‌.. పులివెందుల డీఎస్పీకి ఫోన్‌

Oct 21 2026 10:31 AM | Updated on Oct 21 2026 11:00 AM

YSRCP MP YS Avinash Reddy Calls Pulivendula DSP

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందులలో టీడీపీ గూండాలు తగలబెట్టిన వాహనాలను వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి పరిశీలించారు. టీడీపీ గూండాలు, పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని.. వాహనాల ధ్వంసం, షాపుల దగ్ధంతో పాటు కాల్పులకు తెగబడ్డారు. ఓటమి భయంతో అరాచకాలకు తెరలేపారు. అరాచకాలు చేసి గెలిస్తే ఒక గెలుపు అవుతుందా?’’ అంటూ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు.

పులివెందుల డీఎస్పీకి ఫోన్‌ చేసిన ఎంపీ అవినాష్‌రెడ్డి.. పోలీసులకు జీతాలు ఇచ్చేది కూటమి నేతలు కాదన్నారు. పోలీసులు దగ్గరుండి దాడులకు ప్రోత్సహిస్తున్నారు. షాపులు దగ్ధం ఘటనలో సీసీ ఫుటేజ్‌ ఉన్నా చర్యలేవీ?. వరస్ట్‌ పోలీసింగ్‌ పులివెందులలోనే కనిపిస్తుందంటూ అవినాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గూండాలు అరాచకం సృష్టిస్తున్నారు. పులివెందులలో టీడీపీ గూండాలు బీభత్సం సృష్టించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా నామినేషన్ వేసిన నిరంజన్ రెడ్డి, అంజనప్ప ఇళ్లపై దాడి చేశారు. నిరంజన్‌రెడ్డి ఇంటిపై బీరు బాటిళ్లతో దాడి చేసిన పచ్చమూకలు.. ఇంటి ముందు ఉన్న లారీ తగలబెట్టారు. అంజనప్ప ఇంటి వద్ద స్కూటీకి టీడీపీ గూండాలు నిప్పంటించారు. నామినేషన్ వేసిన వారిని ప్రచారం చేసుకోనివ్వకుండా పచ్చమూకలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.

ఇదీ చదవండి: ఎంపీపీ కుర్చీకి రూ.2 కోట్ల బేరమంట!

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement