మంత్రి చెబితే ఇలా చేస్తారా? | Janasena Nominations Not Accepted Atmakur | Sakshi
Sakshi News home page

మంత్రి చెబితే ఇలా చేస్తారా?

Oct 21 2026 8:45 AM | Updated on Oct 21 2026 9:09 AM

 Janasena Nominations Not Accepted Atmakur

ఆత్మకూరు(నెల్లూరు జిల్లా): మున్సిపల్ ఎన్నికల్లో జనసేన నామినేషన్లను తీసుకోకుండా అధికారులు కాలయాపన చేశారని ఆ పార్టీ నేత నలిశెట్టి శ్రీధర్ అన్నారు. కమిషనర్‌తో ఆయన ఫోన్‌లో వాదులాడిన వీడియో వైరలైంది. మీ ప్రవర్తన సరికాదని, మంత్రి చెబితే ఇలా ప్రవర్తిస్తున్నారా అంటూ నిలదీశారు. వివరాలిలా ఉన్నాయి. కూటమిలో తొలుత జనసేనకు రెండు, బీజేపీకి రెండు వార్డులు టీడీపీ కేటాయించింది. కాగా జనసేన ఆరు వార్డులు, బీజేపీ నాలుగు వార్డులు కోరింది. ఈ క్రమంలో పొత్తులు పొసగక జనసేన 10 వార్డులకు, బీజేపీ 4 వార్డులకు నామినేషన్ దాఖలు చేసింది.

బీజేపీ మద్దతుదారుడైన జగదీశ్ 5, 6 వార్డుల్లో తన కోడలిచే నామినేషన్లు వేయించి తెలుగుదేశం అభ్యర్థులకు పోటీగా ఉండనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం జనసేన నాయకుడు నలిశెట్టి శ్రీధర్ నామినేషన్లు దాఖలు చేసేందుకు పలువురిని 1.30 నుంచి 2 గంటల సమయంలో పంపించారు. అయితే కొందరివి మాత్రమే తీసుకొని, మరికొందరి నామినేషన్లు తీసుకోలేదని తెలియడంతో శ్రీధర్ ఫోన్‌లో కమిషనర్‌తో వాదులాడారు. సరైన సమయానికే అభ్యర్థులొచ్చినా ఎందుకు నామినేషన్లు తీసుకోలేదని ప్రశ్నించారు. తమకు పొత్తు కుదరకపోవడంతో కొందరివి మాత్రమే తీసుకున్నారని వాపోయారు. కాగా స్క్రూటినీలో కోడూరు జయలక్ష్మి అనే జనసేన మహిళ నామినేషన్ తిరస్కరణకు గురైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement