May 16th AP Elections 2024 News Political Updates
6:25 PM, May 16th, 2024
విజయవాడ
రాష్ట్ర ప్రజలంతా మళ్లీ వైఎస్ జగన్ రావాలని కోరుకున్నారు: మంత్రి బొత్స
- రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మళ్లీ వైఎస్ జగనే రావాలని కోరుకున్న వైనం ఓటింగ్ లో స్పష్టంగా తెలిసింది
- ఎన్నికలలో నూతన ట్రెండ్‌ని వైఎస్ జగన్ తీసుకొచ్చారు
- ఇచ్చిన హామీలని గత ఐదేళ్లలో హామీలు అమలు చేశాం
- విద్య, వైద్యా రంగాలలో విప్లవాత్మకమైన సంస్కరణలు గత ఐదేళ్లలో జరిగాయి
- గత అయిదేళ్ల పాలన చూసి ఓటు వేయండని చరిత్రలో ఏ పార్టీ అడగలేదు
- ప్రజలకి మేలు జరుగుతుందంటేనే సిఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటారు...మళ్లీ వెనకడుగు వేయరు
- సిఎం పాలన చూసే ప్రజలు ఉవ్వెత్తున వచ్చి ఓటేశారు
- జూన్ 9 న విశాఖలో సిఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు
- అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాం
- *ఒకటో తేధీన పెన్షన్ రావాలని వృద్దులు...మళ్లీ పథకాలు కొనసాగాలని మహిళలు కోరుకున్నారు
- టీడీపీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది
- మా టార్గెట్ 175కి 175 సీట్లు... దానికి దగ్గరగానే రిజల్ట్ రాబోతోంది
- హింసని ప్రేరేపించకూడదనే మేము సంయమనం పాటిస్తున్నాం
- జగన్ లాంటి నాయకుడు లేకపోతే మంచి పాలన అందదని ఓట్లు వేశారు
- సిఎం జగన్ పాలనలో సామాజిక న్యాయం సమంగా పాటించడం చరిత్రలో ఎపుడూ జరగలేదు
- 50 శాతంసీట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం
- ఇలాంటి సామాజిక న్యాయం జరిగిన పాలన గతంలో ఎపుడూ చూడలేదు
- నాకు ఈ కారణం వల్ల ఓటేయండి అని చంద్రబాబు అడిగారా
- నన్ను చూసి ఓటు వేయండని చంద్రబాబు అడిగారా
- మా పాలన చూసి... మీకు మంచి జరిగితేనే ఓటు వేయండని సీఎం వైఎస్ జగన్ అడిగారు
- చంద్రబాబు గత పాలనచూసి ఎవరైనా నమ్ముతారా
- సీఎం వైఎస్ జగన్ అంటే చెప్పిందే చేస్తాడు...చేసేదే చెప్తాడు అని నమ్మకం
- సీఎం జగన్ పాలనలోనే ఆర్ధికంగా ఎదిగామని సామాన్యులు భావించబట్టే మాకు ఓటేసారు
- భూహక్కు చట్టం గురించి తప్పుడు వార్తలు రాశారు
- చంద్రబాబు కుయుక్తుల వల్లే పెన్షన్ ఆగాయి
- పోలింగ్ తర్వాత నుంచి డిబిటి స్కీమ్స్ కింద జమ అవుతాయని చెప్పాం
- చెప్పునట్టుగానే డిబిటి నిధులు విడుదలవుతున్నాయి
- ఇదీ మా ప్రభుత్వ క్రెడిబిలిటీ
- అదే చంద్రబాబు అయితే ఎన్నికలు ముగిసాయి కాబట్టి తన తాబేదార్లకి , కాంట్రాలర్లకి ఇచ్చేవారు
5:21 PM, May 16th, 2024
అనంతపురం:
తాడిపత్రిలో అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదు
- తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 526 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
- ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడిన టీడీపీ నేతలు
- పరారీలో టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి
- ఇప్పటిదాకా 55 మందిని అరెస్టు చేసిన పోలీసులు
- ఉరవకొండ కోర్టు లో నిందితులను హాజరుపరిచిన పోలీసులు
- జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన వర్గీయులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు
5:15 PM, May 16th, 2024
దీపక్ మిశ్రా వల్లే ఈ విధ్వంసం: మోపిదేవి వెంకట రమణ
- పోలీసుల పక్షపాత ధోరణి వల్లే ఈ హింస జరుగుతోంది
- దీపక్ మిశ్రా కనుసన్నల్లో పోలీసులు ఉన్న చోట ఈ హింస జరుగుతుంది
- ప్రశాంతంగా ఉన్న ఏపీ లో ఇలాంటి పరిస్థితులు రావటానికి కారణాలు దీపక్ మిశ్రా
- దీపక్ మిశ్రా పై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరాం
5:12 PM, May 16th, 2024
ఎన్నికలు పక్షపతం లేకుండా ఏకపక్షంగా జరిగేలా ఎవరు చేశారో గవర్నర్‌కు తెలిపాం: పేర్ని నాని
- ఉద్దేశ పూర్వకంగా బీజేపీ టీడీపీ దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం తెచ్చారు
- అతని వల్లే ఈ విధ్వంసం
- రాష్ట్రంలో హింస జరుగుతున్న ప్రాంతాల్లో వారితో జగన్ ఇప్పటికే మాట్లాడారు
- సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పారు
- హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు ఉంటాయని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పారు అని గవర్నర్ కు తెలిపాం.
- దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారు
- జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారు
- పోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదు
- జిల్లాల్లో ఉన్న అందరూ అధికారులను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు
- దీపక్ మిశ్రా స్థానంలో సర్వీస్‌లో ఉన్న అధికారిని ఏర్పాటు చేయాలని గవర్నర్‌ను కోరాం
5:12 PM, May 16th, 2024
పల్నాడు ఎస్పీ, ఐజీ త్రిపాఠి వంటి కొందరు అధికారులు ఎన్నికల వేల పచ్చ చొక్కాలు వేసుకున్నారు: మేరుగ నాగార్జున
- రాయలసీమ, పల్నాడులో పోలీసులను మార్చాలని కోరాం
- కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో దీపక్ మిశ్రాను మార్చి దేశంలో ఏ అధికారి అయినా పర్లేదు అని గవర్నర్‌ను కోరాం
5:10 PM, May 16th, 2024
పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతోంది: మంత్రి బొత్స
- ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశాము
- అబర్వర్ దీపక్ మిశ్రా పక్ష పతంగా వ్యవహరిస్తున్నారు
- టీడీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారు
- అబర్వర్ గా ఉన్న దీపక్ మిశ్రా పై న్యాయ విచారణ చేయాలి
- ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెచ్చుకుని దీపక్ మిశ్రాను మార్చాలని కోరాము
3:34 PM, May 16th, 2024
ఢిల్లీ:
కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరైన ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా
- ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై ఈసీ సీరియస్
- పల్నాడు, కారంచేడు, తాడిపత్రి, చంద్రగిరి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో చెలరేగిన హింస
- రాష్ట్రంలో ఐజీలు, ఎస్పీలు, సిఐలు మార్చిన చోట చెలరేగిన హింస
- పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పని తీరుపై ఆరోపణలు
- టీడీపీ నేతల సూచనలకు అనుగుణంగా దీపక్ మిశ్రా బదిలీలు చేశారని ఆరోపణ
- ఇదే అదునుగా భావించి దాడులకు పాల్పడ్డ టీడీపీ నేతలు
- పల్నాడు, తిరుపతి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో బీసీల ఇళ్లపై దాడులకు దిగిన టీడీపీ నేతలు
- తమకు ఓటు వేయలేదన్న అక్కసుతో దాడులకు పాల్పడిన టీడీపీ నాయకులు
2:40 PM, May 16th, 2024
ఈసీని కలవనున్న ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా
- ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై వివరణ కోరిన ఈసీ
- రాష్ట్రంలో ఐజీలు, ఎస్పీలు, సీఐలు మార్చిన చోట చెలరేగిన హింస
- పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పని తీరుపై ఆరోపణలు
- టీడీపీ నేతల సూచనలకు అనుగుణంగా దీపక్ మిశ్రా బదిలీలు చేశారని ఆరోపణ
- ఇదే అదునుగా భావించి దాడులకు పాల్పడ్డ టీడీపీ నేతలు
- పల్నాడు, తిరుపతి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో బీసీల ఇళ్లపై దాడులకు దిగిన టీడీపీ నేతలు
- తమకు ఓటు వేయలేదన్న అక్కసుతో దాడులకు పాల్పడిన టీడీపీ నాయకులు
2:15 PM, May 16th, 2024
ఎన్నికల ఫలితాల్లో చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
- విజయవాడ..
- విజయవాడలో ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ
- సీఎం జగన్ కామెంట్స్..
- ఏపీలో మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయం.
- మనమే అధికారంలోకి రాబోతున్నాం.
- ఈసారి చరిత్ర సృష్టించబోతున్నాం.
- జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత యావత్ దేశం మనవైపు చూస్తుంది.
- గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు గెలవబోతున్నాం.
- ఒకరు ఊహించిన దానికంటే మనకు ఎక్కువ సీట్లు వస్తాయి.
- 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలు గెలిస్తే ఈసారి 151 అసెంబ్లీ సీట్లకు పైగా గెలవబోతున్నాం.
- అలాగే 22కు పైగా లోక్‌సభ స్థానాలు గెలుస్తాం.
- తద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
- ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం.
- వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేద్దాం.
- రానున్న రోజుల్లో కూడా వైఎస్సార్‌సీపీ, ఐప్యాక్ ప్రయాణం ఇలాగే ముందుకు కొనసాగుతుంది.
- ఈ ఎన్నికల్లో ఏడాదిన్నరగా ఐ ప్యాక్ టీం అందించిన సేవలు వెలకట్టలేనిది.
1:50 PM, May 16th, 2024
ఢిల్లీ చేరుకున్న సీఎస్, డీజీపీ
- ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా
- మధ్యాహ్నం మూడు గంటలకు ఈసీ ముందు హాజరు కానున్న సీఎస్, డీజీపీ
- ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై వివరణ కోరిన ఈసీ
1:30 PM, May 16th, 2024
పెదవేగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
- ఏలూరు జిల్లా
- పెదవేగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
- హత్యాయత్నం కేసులో ఉన్న ముద్దాయిని టీడీపీ కార్యకర్త కావడంతో పోలీస్ స్టేషన్ నుండి బలవంతంగా తీసుకువెళ్లిన చింతమనేని ప్రభాకర్.
- మరోసారి బయటపడ్డ చింతమనేని ప్రభాకర్ గుండా గిరి
- పోలీసులు అడ్డుకోవడంతో చింతమనేని ప్రభాకర్‌తో పాటు వారి అనుచరులు పోలీసులపై దాడికి ప్రయత్నం.
- కొప్పులవారిగూడెం ఎలక్షన్ రోజున బూత్‌లో ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు రవిపై దాడి చేసిన ముద్దాయి తాలూరి రాజశేఖర్
- పెదవేగి పీఎస్‌లో ఉన్న అతనిని చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యంగా లాక్కొని తన కారులో వేసుకొని తన అనుచరులతో పారిపోయాడు.
- హత్యాయత్నం చేసిన ముద్దాయిని చింతమనేని తీసుకువెళ్లిపోవటంతో పీఎస్ ఎదుట బైఠాయించి వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసన.
12:50 PM, May 16th, 2024
టీడీపీ అభ్యర్థి అనుచరుడి దౌర్జన్యం.
- నెల్లూరు..
- సామాన్యులపై కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అనుచరుడు మురళి దౌర్జన్యం.
- డబ్బులు తీసుకుని తమకు ఓటు వేయలేదని.. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగిన మురళి.
- కావ్య కృష్ణారెడ్డి డబ్బులు తీసుకొని రమ్మన్నాడంటూ ఫోన్ చేసి బెదిరించిన టీడీపీ నాయకుడు నున్నా మురళి.
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టీడీపీ నేత మురళి బెదిరింపుల ఆడియో.
- కావ్య కృష్ణారెడ్డి అనుచరుల బలవంతపు వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లు.
12:20 PM, May 16th, 2024
గవర్నర్‌ను కలవనున్న వైఎస్సార్‌సీపీ బృందం
- తాడేపల్లి :
- సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్న వైఎస్సార్‌సీపీ బృందం
- పోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్‌సీపీ నేతలు
- సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలవనున్న నేతలు
- హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్న వైఎస్సార్‌సీపీ బృందం
12:00 PM, May 16th, 2024
అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదు
అనంతపురం:- తాడిపత్రిలో అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదు
- తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 526 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
- ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడిన టీడీపీ నేతలు
- పరారీలో టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి
- ఇప్పటిదాకా 55 మందిని అరెస్టు చేసిన పోలీసులు
- ఉరవకొండ కోర్టులో నిందితులను హాజరుపరిచిన పోలీసులు
- జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన వర్గీయులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు
11:45 AM, May 16th, 2024
టీడీపీ నాయకుడి దాష్టీకం
- కృష్ణా జిల్లా..
ఉంగుటూరు మండలం ఆత్కూరులో టీడీపీ నాయకుడు దాష్టీకం - ఫ్యాన్‌కు ఓటు వేసిందని మహిళను ట్రాక్టర్‌తో ఢీకొట్టిన టీడీపీ నాయకుడు ఏడుకొండలు
- ఆత్కూరు గ్రామానికి చెందిన వేముల సంధ్యారాణికి తీవ్ర గాయాలు.
- సంధ్యారాణి రెండు కాళ్ళకు తీవ్ర గాయాలు
- పిన్నమనేని హాస్పిటల్‌కు తరలింపు
- హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంధ్యారాణిని పరామర్శించిన వల్లభనేని వంశీ
- ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
10:25 AM, May 16th, 2024
ఎన్నికల హింసపై గవర్నర్‌కు ఫిర్యాదు
- ఏపీలో ఎన్నికల హింసపై గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
- ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్ వెళ్లనున్న వైఎస్సార్‌సీపీ బృందం
- మంత్రి బొత్స నేతృత్వంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు కలవనున్న వైఎస్సార్‌సీపీ బృందం
- పోలింగ్ సందర్భంగా టీడీపీ అరాచకాలపై, పోలీసులు వ్యవహరించిన తీరును గవర్నర్‌కు వివరించే అవకాశం
- హింసకు బాధ్యులైన వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్న వైఎస్సార్‌సీపీ నేతలు
9:40 AM, May 16th, 2024
రాష్ట్రంలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల..
- డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
- నిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1480,
- జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్‌మెంట్‌కు రూ.502 కోట్లు విడుదల
- మిగిలిన పథకలకూ విడుదల కానున్న నిధులు
- రెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తిచేయనున్న ప్రభుత్వం
- టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్‌కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను అడ్డుకున్న ఎన్నికల సంఘం
- ఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఎటూ తేల్చని ఎన్నికల సంఘం
- ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
- ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో హైకోర్టు ఆగ్రహం
- సమయం ముగిసిపోవడంతో పోలింగ్‌కు ముందు విడుదల కాని నిధులు
- పోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదల ప్రారంభం
9:00 AM, May 16th, 2024
అనంతలో సెక్షన్ 144 కొనసాగింపు..
- అనంతపురం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగింపు
- ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ వినోద్ కుమార్
- ఎన్నికల సందర్భంగా అనంతలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు.
- వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పచ్చ మూకలు దాడులు చేశారు.
8:20 AM, May 16th, 2024
ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు
- విజయవాడ
- ఫిరాయింపు ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు
- అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్న శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు
- టీడీపీలో చేరిన జాంగా కృష్ణ మూర్తి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి అనర్హుడిగా ప్రకటించిన శాసన మండలి చైర్మన్
7:45 AM, May 16th, 2024
వైఎస్సార్‌సీపీ అనుకూల వర్గాలే టార్గెట్.. మహిళలపై పచ్చ మూకల దాష్టీకాలు
- నర్సీపట్నంలో దుశ్శాసన పర్వం
- ఒంటరి మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చి కాళ్లతో తన్నిన అయ్యన్న అనుచరులు
- కృష్ణా జిల్లాలో దమనకాండ
- మహిళను ట్రాక్టర్‌తో తొక్కి చంపడానికి ప్రయత్నించిన టీడీపీ నేత
- మహిళలపై హత్యాయత్నాలు చేస్తున్నా ఏమీ పట్టనట్లు ఈసీ నిర్లిప్తత
- గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు
- చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం
- ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించేలా చంద్రబాబు పన్నాగం.. రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పురిగొల్పుతూ భయానక వాతావరణం
- రాజకీయ ప్రత్యర్థులపై గ్రామాల్లో విచ్చలవిడిగా దాడులు..
- కౌంటింగ్‌కు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను దూరంగా ఉంచడమే లక్ష్యం
7:20 AM, May 16th, 2024
నేడు విజయవాడకు సీఎం జగన్
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడకు రానున్నారు.
- ఈ సందర్భంగా బెంజి సర్కిల్‌లో ఉన్న ఐ-ప్యాక్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు.
- సుమారు అర గంట పాటు ఐ-ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ కానున్నారు.
7:00 AM, May 16th, 2024
నేడు ఈసీఐని కలవనున్న ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- ఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్, డీజీపీని నివేదిక కోరిన ఈసీఐ
- ఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్న సీఎస్, డీజీపీ
- ఎన్నికల పోలింగ్‌కు కొద్దీ రోజులు ముందే డీజీపీ, ఐజీ, ఎస్పీలను మార్చిన ఎన్నికల కమిషన్
- అకస్మాత్తుగా పోలీస్ అధికారులను మార్చడంతో పెరిగిన హింసాత్మక ఘటనలు
- పల్నాడు ఎస్పీ, ఐజీ, డీజీపీని పోలింగ్‌కు ముందు మార్చిన ఈసీఐ
- ఈసీ ఆకస్మిక నిర్ణయాలతో హింస పెరిగిందని భావిస్తున్న అధికారులు
6:50 AM, May 16th, 2024
ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
- టీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపినట్లు దీపక్ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
- పోలింగ్ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీ
- పోలింగ్‌కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్ ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు గుర్తింపు
- ఆ తర్వాత నుంచి పోలీస్ అధికారుల మార్పులపై అనుమానాలు
- మాచర్ల,గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్‌ఐల మార్పులు
- చివరికి సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా దీపక్ మిశ్రా జోక్యం చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుఈ కేసులో ఏ2 నిందితుడిని అరెస్ట్
- చేయొద్దని విచారణ అధికారిపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీ
- ఆధారాలతో సహా డీజీపీ, ఈసీలకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ
6:40 AM, May 16th, 2024
రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతోనే దాడులకు తెగబడ్డారు: సజ్జల రామకృష్ణారెడ్డి
- టీడీపీ అరాచక శక్తులు పోలింగ్ సరిగ్గా జరగకుండా చేయాలని చూశాయి
- రిగ్గింగ్ చేయాలనీ, మా వారిని అడ్డుకోవాలనీ చూశారు
- టీడీపీ నేతలు చేసిన అరాచకాలపై ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేశాం
- ఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరింది
- పురంధేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారు
- వారు కోరిన అధికారులను వేశారు
- మొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారు
- విష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారు
- విష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషి
- అలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?
- టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసింది
- రెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరసపెట్టి ట్రాన్సఫర్ చేశారు
- ఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారు
- ప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారు
- అక్కడే ఎక్కువ హింస చెలరేగింది
- జరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయి
- మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారు
- ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు
- వెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలి
- ఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలి
- సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది
- కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోంది
- కచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోంది
- సీఎస్, డీజీపిని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణం
- పోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?
- వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం
- పురంధేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం
- పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉంది
- లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్ గా నియమించటం ఏంటి?
- ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారు
- రిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?
- ఓటర్లు తమ బాధ్యతగా తీసుకుని పోలింగులో పాల్గొన్నారు.
6:30 AM, May 16th, 2024
మైదుకూరులో టీడీపీ గుండాల దాడి
- విశ్వనాథ పురానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం
- ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్నాడని కోపంతో ఓబుల్ రెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలు
- దాడిలో తీవ్ర గాయాలు.. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
- ఆసుపత్రిలో ఓబుల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment