AP BJP Chief Somu Veerraju Criticizes Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

మాతో పొత్తా?.. పద్ధతిగా ఉండదు! చంద్రబాబుపై సోమువీర్రాజు ఘాటు వ్యాఖ్యలు

Jun 21 2023 9:54 AM | Updated on Jun 21 2023 10:36 AM

AP BJP Chief Somu Veerraju Criticize Chandrababu Naidu - Sakshi

కేంద్రంలో చక్రం తిప్పానంటాడు. మరి ఆ ఫేమ్‌తో రైల్వేజోన్‌.. 

సాక్షి, ప్రకాశం: బీజేపీని అవమానించేలా మాట్లాడే వ్యక్తితో పొత్తు ఆలోచన ఎలా? చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. ఈ క్రమంలో.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. 

ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబే. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నది చంద్రబాబే. ప్రధానులను మార్చే శక్తి ఉన్నవాడిని.. కేంద్రంలో చక్రం తిప్పానంటాడుగా. మరి అప్పుడు రైల్వేజోన్‌ ఎందుకు తేలేకపోయాడు. నోటాతో పోటీపడే పార్టీ బీజేపీ అన్నారుగా.. ఇప్పుడు మాతో ఎలా పొత్తు పెట్టుకుంటారని బీజేపీ ఏపీ చీఫ్‌ సోమువీర్రాజు నిలదీశారు. 

ఆ అర్హత లేదు
సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధించిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు శాంతిభద్రతల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు. చంద్రబాబు అధికారంలో ఉంటే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయా?. తిరుపతిలో హోంమంత్రి అమిత్‌ షాపై దాడి చేస్తే.. వాళ్ల మీద చర్యలు తీసుకున్నావా?. చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి.. లేకుంటే పద్ధతిగా ఉండదు అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారాయన. 

ఇదీ చదవండి: బాబూ.. శవాల మీద పేలాలు ఏరుకోకు!

Advertisement
 
Advertisement
Advertisement