చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్‌! | AP Assembly Session 2020 Kodali Nani Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఫేక్‌ ప్రతిపక్షనేత: కొడాలి నాని

Dec 3 2020 11:42 AM | Updated on Dec 3 2020 2:45 PM

AP Assembly Session 2020 Kodali Nani Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడు ఫేక్‌ ప్రతిపక్ష నేత, టీడీపీ ఫేక్‌ పార్టీ అంటూ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని ఫైర్‌ అయ్యారు. పొత్తు లేకుండా పోటీ చేయలేని వ్యక్తికి తమ నాయకుడిని విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు చేసిన విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘‘పారిపోయేవాళ్లు ఎవరో ప్రజలందరికి తెలుసు. చంద్రగిరి వదిలి కుప్పం పారిపోయింది చంద్రబాబు కాదా. 

ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి పారిపోయారు. ఇక కరోనా రాగానే కాల్వగట్టు నుంచి హైదరాబాద్‌కు పారిపోయారు. ఆయనో ఫేక్‌ ప్రతిపక్షనేత’’ అంటూ చురకలు అంటించారు. ‘‘చంద్రబాబు పాలనలో ఒక్క పెన్షన్‌ కూడా పెంచలేదు. టీడీపీ హయాంలో ఎవరైనా చనిపోతేనే కొత్త పింఛన్‌ ఇచ్చేవారు.. కానీ సీఎం జగన్‌ వచ్చాక అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నాం. ఒకటో తారీఖునే ఠంచనుగా పింఛన్‌ అందిస్తున్నాం’’ అని తమ ప్రభుత్వ తీరును వివరించారు.(చదవండి: ఏపీ అసెంబ్లీ: లైవ్‌ అప్‌డేట్స్‌)  

బాబు మెప్పు కోసమే ఆరోపణలు: బొత్స
‘‘ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు. సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన ధీరుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రజామోదంతో సీఎం అయ్యారు. వెన్నుపోటు రాజకీయాలు ఆయనకు తెలియవు. చంద్రబాబు మెప్పు కోసమే టీడీపీ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే సభను తప్పదోవ పట్టించాలని చూస్తున్నారు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ సభ్యుల తీరును విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement