
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ చేస్తున్న మోసాన్ని భరించలేకపోతున్నారు..
సాక్షి, గుంటూరు: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ.. రాజకీయ వలసలు పెరిగిపోతున్నాయి. తాజాగా.. అనకాపల్లి జిల్లాలో తెలుగు దేశం పార్టీకి మరో షాక్ తగిలింది. పెందుర్తి నేత గండి రవికుమార్ టీడీపీని వీడారు. బుధవారం మధ్యాహ్నాం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాయన.
గండి రవికుమార్‌తో పాటు స్థానిక టీడీపీ నేత ప్రసాదరావులకు సీఎం జగన్ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, వైఎస్‌ఆర్‌సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ భగవాన్ జయరామ్ తదితరులు పాల్గొన్నారు.