పేదల భూములు కొట్టేసిన నారాయణ సత్య హరిశ్చంద్రుడా?: అనిల్‌ | Anil Kumar Yadav Comments On Chandrababu And Narayana | Sakshi
Sakshi News home page

పేదల భూములు కొట్టేసిన నారాయణ సత్య హరిశ్చంద్రుడా?: అనిల్‌

Oct 1 2023 9:50 AM | Updated on Oct 1 2023 10:38 AM

Anil Kumar Yadav Comments On Chandrababu And Narayana - Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: ప్రజల ఆరోగ్య రక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని, జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, నారాయణ కలిసి వేలకోట్లు దోచుకున్నారని మండిపడ్డారు.

‘‘పేదల భూములు కొట్టేసిన నారాయణ సత్య హరిశ్చంద్రుడా?. త్వరలో అరెస్టవుతానని నారాయణకి భయం పట్టుకుంది. రూ.800 కోట్ల పేదల అసైన్డ్‌ భూములు నారాయణ దోచేశారు. త్వరలో నారాయణ అక్రమాలన్నీ బయటపడతాయి. విచారణకు సహకరించకూడదని బాబు, నారాయణ మాట్లాడుకున్నారు. వారి చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు’’ అని అనిల్‌ పేర్కొన్నారు.

‘‘టీడీపీ నేతలు గంటలు కొట్టడం దేవుడి స్క్రిప్ట్.. ముద్రగడను, ఆయన కుటుంబ సభ్యులను చిత్ర హింసలు పెట్టీ.. ఇబ్బందులు పెట్టిన విషయం టీడీపీ నేతలకు గుర్తు లేదా..?. లోకేష్ ఒక పులకేశి.. ఢిల్లీలో లాయర్స్‌తో మాట్లాడుతున్నాడని టీడీపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారు. సీఐడీ అధికారులకు దొరక్కుండా లోకేష్ దొంగలగా తప్పించుకుని తిరుగుతూ ఉంటే.. నిన్న అధికారులు పట్టుకుని నోటీసులు ఇచ్చారు’’ అంటూ అనిల్‌ ఎద్దేవా చేశారు.
చదవండి: అసలు చంద్రబాబు అరెస్ట్‌కి, తిరుమలకు ఏం సంబంధం?


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement