విశ్వసనీయతే పెట్టుబడి | - | Sakshi
Sakshi News home page

విశ్వసనీయతే పెట్టుబడి

Nov 16 2026 12:02 AM | Updated on Nov 16 2026 12:02 AM

చేను కాదు.. చెరువే..

ఇది చేను కాదు.. ఏపుగా పెరిగి చెరువును కమ్మేసిన గుర్రపుడెక్క. తామర ఆకు. పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట చెరువులోనిదీ దృశ్యం. పచ్చని ఆకులతో చేను, చెలక మాదిరిగా కనిపిస్తోంది.

– పెద్దపల్లిరూరల్‌

గోదావరిఖని: పోటీ మార్కెట్‌ను తట్టుకునేందుకు బొగ్గు నాణ్యతపై సింగరేణి ప్రత్యేక దృష్టి సారించింది. కోలిండియాతోపాటు అనేక సంస్థలు, విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకున్నా.. సింగరేణి బొగ్గుకు డిమాండ్‌ మాత్రం అలాగే ఉంది. ఇందుకు నాణ్యతే కీలకమని యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యుత్‌, సిమెంట్‌, ఫార్మా, ఐరన్‌ కంపెనీలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తోంది. నాణ్యత విషయంలో రాజీపడకుండా వినియోగదారుల్లో విశ్వసనీయత పెంచుతూ తన ఉద్యోగులకు నాణ్యతపై అవగాహన కల్పించేందుకు నాణ్యత వారోత్సవాలూ నిర్వహిస్తోంది.

మార్కెటింగ్‌లో ప్రత్యేకత..

సింగరేణి ఏటా సుమారు 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. మార్కెట్‌లో విక్రయించడంలోనూ ప్రత్యేకత చాటుకుంటోంది. సింగరేణి బొగ్గు కొనుగోలు చేసేందుకు వివిధ కంపెనీలూ పోటీపడడంతో వినియోగం బాగా పెరిగింది. అవసరమైన వారికి రైల్వే, రోడ్డు మార్గాల ద్వారా బొగ్గు సరఫరా చేస్తోంది. ప్రధానంగా థర్మల్‌ పవర్‌ ప్లాంట్లకు అత్య ధికంగా అందిస్తోంది. సింగరేణిలో జీ–5, 7, 8, 10, 11, 13 గ్రేడ్‌ బొగ్గు ఎక్కువగా విక్రయిస్తోంది.

వీరే వినియోగదారులు..

సింగరేణి వివిధ సంస్థలకు బొగ్గు అందిస్తోంది. నాన్‌ పవర్‌ సెక్టార్‌లో ఐటీసీ భద్రాచలం, నవభార త్‌, హెవీ వాటర్‌ ప్లాంట్‌, ఏసీసీ వాడి, బసంత్‌నగర్‌ అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌ సెక్టార్‌లో బీటీపీఎస్‌ మణుగూరు, కేటీపీఎస్‌ పాల్వంచ, కేటీపీపీ భూపాలపల్లి, మహాజెన్‌కో చంద్రపూర్‌, ఎన్టీపీసీ రామగుండం, వీటీపీఎస్‌ విజయవాడ, బీటీపీఎస్‌, వైటీపీఎస్‌, ఆర్‌టీపీఎస్‌ రాయచూర్‌, టంగెడ్‌కో ఉన్నాయి.

ప్రత్యేకంగా క్వాలిటీ డిపార్ట్‌మెంట్‌

సింగరేణి క్వాలిటీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. కార్పొరేట్‌ స్థాయిలో జీఎం, రామగుండం, బెల్లంపల్లి, కొత్తగూడెం రీజియన్లలో క్వాలిటీ జీఎంలను ని యమించి నాణ్యతపై డేగకన్ను వేస్తోంది. నాణ్యత పై ప్రస్తుతం వారోత్సవాలు నిర్వహిస్తూ ఉద్యోగు లకు అవగాహన కల్పిస్తోంది. ఇదేసమయంలో వినియోగదారుల విశ్వనీయత కాపాడుకుంటోంది.

సొంతంగా టెస్టింగ్‌ ల్యాబ్‌లు

థర్డ్‌పార్టీ శాంప్లింగ్‌తోపాటు సొంతంగా కోల్‌ ల్యా బో రేటరీలు ఏర్పాటు చేసి సొంతంగా నాణ్యత పరీక్షలు నిర్వహిస్తోంది. కస్టమర్లు ప్రైవేట్‌ ఏజెన్సీతో నాణ్యతను పరీక్షించుకునే వీలు కూడా కల్పిస్తోంది.

సింగరేణి బొగ్గు ధరలు(టన్నుకు రూ.లలో)

జీ–5 5,385

జీ–6 5,450

జీ–7 5,050

జీ–8 4,360

జీ–9 3,920

జీ–10 3,860

జీ–11 3,220

జీ–13 2,540

బొగ్గు నాణ్యత నిర్ధారణకు ప్రత్యేక విభాగం

సింగరేణిలో నాణ్యత వారోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement