కులవృత్తిపై మమకారం.. మట్టితో మమేకం | - | Sakshi
Sakshi News home page

కులవృత్తిపై మమకారం.. మట్టితో మమేకం

Nov 16 2026 12:02 AM | Updated on Nov 16 2026 12:02 AM

మంథనిరూరల్‌: ఆధునిక జీవనశైలి, యంత్రాల ప్రభావంతో సంప్రదాయ కులవృత్తులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు ప్రతీపల్లెలో కనిపించిన కుమ్మర సారెలు, మట్టి పాత్రల తయారీ నేడు అరుదుగా కనిపిస్తున్నాయి. మట్టిపాత్రల స్థానంలో ప్లాస్టిక్‌, స్టీల్‌ వస్తువులు వచ్చి చేరడంతో కుమ్మర సారెలు మూలనపడుతున్నాయి. అయితే తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన వృత్తిని కాపాడుకోవాలని, మరింత ఆధునికతతో ముందుకు రావాలనే గొప్ప సంకల్పంతో మంథని మండలానికి చెందిన యువకులు, గృహిణులు ముందడుగు వేస్తున్నారు.

మట్టితో మమేకమై.. నైపుణ్యానికి పదును..

మంథని మండలం సూరయ్యపల్లిలో తొలిసారి గ్రా మోద్యోగ్‌ వికాస్‌ యోజన పథకం ద్వారా కుమ్మరులకు పది రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. మంథని, సూరయ్యపల్లి, పుట్టపాక తదితర గ్రామాల నుంచి సుమారు 20 మంది యువకులు, మహిళలు ఇందు లో శిక్షణ పొందుతున్నారు. సంప్రదాయ పద్ధతుల తో ఆధునిక అవసరాలకు అనుగుణంగా కొత్త తర హా వస్తువులను తయారు చేయడంపై దృష్టి సారించారు. కుండలు, ప్రమిదలు, దీపాలు, కుండీలు, ఇ తర అలంకరణ వస్తువులు తదితర ఉత్పత్తుల త యారీలో మెళకువలు నేర్చుకుంటున్నారు. చక్రంపై ఆకృతులు రూపొందించడం, ఆరబెట్టి కాల్చడం వరకు ప్రతిఅంశంలోనూ నైపుణ్యం సాధిస్తున్నారు.

ఉపాధితోపాటు ఆత్మగౌరవం

కుమ్మరి వృత్తి కేవలం జీవనోపాధి మాత్రమే కాద ని, అది తమ పూర్వీకులు అందించిన వారసత్వ సంపద అని యువకులు చెబుతున్నారు. ఉద్యోగాలు, ఇతర ఉపాధి మార్గాల వైపు పరుగులు తీస్తున్న ప్రస్తుత తరుణంలో తమ మూలాలను మరిచిపోకుండా వృత్తిని నేర్చుకోవడం గర్వంగా ఉందని అంటున్నారు. శిక్షణతో నాణ్యమైన మట్టి వస్తువులను తయారు చేసి మార్కెట్లో విక్రయించడం ద్వారా మెరుగైన ఉపాధి పొందవచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ వృత్తికి ఆధునికత జోడిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని, రాబోయే తరాలకు కుమ్మరి వృత్తిని అందించాలనే తపనతో ముందుకు వచ్చామని చెబుతున్నారు.

సూరయ్యపల్లిలో కుమ్మరులకు 10 రోజులపాటు శిక్షణ

ఆధునిక డిజైన్లతో మార్కెట్లోకి ఆకట్టుకునే మట్టి వస్తువులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement