ప్రకాశ్‌కు స్వాగతం పలుకుతున్న అధికారులు
ఒక రోడ్డు.. రెండు మండలాలు
ఇది సీసీ రోడ్డు. ఒకవైపు సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామం ఉంటే.. మరోవైపు పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామం ఉంది. రోడ్డు ఒక్కటే.. రెండువైపులా దానిని ఆనుకుని ఉన్న మండలాలు, ఊళ్లే వేరు. పల్లెవాసులు కూడా పక్కపక్కనే నివాసం ఉంటు న్నారు. తమ అవసరాల కోసం దేవునిపల్లి గ్రామస్తులు సుల్తానాబాద్ మండలం, నిమ్మనపల్లివాసులు పెద్దపల్లి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిందే. ఇలాంటి పరిస్థితే పెద్దపల్లి మండలం సబ్బితం, కమాన్‌పూర్ మండలం పేరపల్లిలోనూ కనిపిస్తోంది. ఇక్కడైతే ఒక్కరోడ్డు అసెంబ్లీ నియోజకవర్గాలనే వేరు చేస్తోంది. కమాన్‌పూర్ మండలం పేరపల్లి మంథని సెగ్మెంట్ పరిధిలో ఉంటే.. పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామం పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో ఈ ముఖచిత్రాలు మారతాయో.. లేదో చూడాల్సిందే..!
– పెద్దపల్లిరూరల్
మంథని: జిల్లాలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. గాలి నింపే యంత్రాలు పనిచేయకపోవడం, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం, తాగునీటి సౌకర్యం లేకపోవడం, ఇంధన ధరలు స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలు వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయనే విమర్శలు న్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, కొలతల్లోనూ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి.
అమలుకు నోచుకోని నిబంధనలు
పెట్రోల్ బంక్ నిర్వాహకులు చమురు సంస్థలు, చట్టబద్ధమైన కొలతల శాఖ, అగ్నిమాపక భద్రతా నిబంధనలు, పర్యావరణ, స్థానిక సంస్థలు విధించే నిబంధనలు పాటించాలి. ఇంధన ధరలు స్పష్టంగా తెలిసేలా ప్రదర్శించాలి. ధ్రువీకరించిన కొలత పరికరాలతోనే విక్రయాలు చేయాలి. కొన్నిచోట్ల ధరల బోర్డులు కనిపించడంలేదు. ఇదేమని అడిగితేనే పలానా ధర అని సిబ్బంది చెబుతున్నారు.
పేరుకే గాలి నింపే యంత్రాలు
కొన్ని బంకుల్లో గాలి నింపే యంత్రాలు పనిచేయడంలేదు. సిబ్బంది అందుబాటులో ఉండడంలేదు. మరుగుదొడ్లు పరిశుభ్రతతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. తాగునీటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. నీటి నాణ్యతపై శ్రద్ధ చూపడంలేదు. ముఖ్యంగా మహిళలు, పిల్లలకు సౌకర్యాలు అవసరం. సౌకర్యాలు ఉన్నాయని బోర్డులు పెట్టడమే కాకుండా అందుబాటులో ఉన్నాయా? లేదా? అని అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది.
కొలతల్లో మోసమైతే జేబుకు చిల్లు
పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసే సమయంలో చెల్లించిన మొత్తానికి తగిన పరిమాణంలో ఇంధనం అందడం లేదని, తక్కువ పరిమాణంలో సరఫరా అవుతోందనే అనుమానం వాహనదారుల్లో వ్యక్తవుతోంది. కొలత పరికరాల ధ్రువీకరణ, సీల్స్ స్థితి, పంపుల పనితీరును చట్టబద్ధమైన కొలతల శాఖ తనిఖీ చేయాలి. అనుమానాస్పద పరిస్థితుల్లో అధికారిక తనిఖీ ద్వారా మాత్రమే అక్రమాన్ని నిర్ధారించాలి. తప్పు నిర్ధారణ అయితే వర్తించే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలి. సాధారణ వినియోగదారుడు ప్రతీ లీటరును స్వయంగా పరీక్షించలేని పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అది ప్రజల జేబులకు గండికొట్టడమే అవుతుందని, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.
కల్తీపై అనుమానాలు
ఇంధన నాణ్యత విషయంలోనూ వినియోగదారుల నుంచి అనేక ఫిర్యాదు ఉన్నాయి. వాహనాలు మొ రాయిస్తున్నాయని, బంకుల నుంచి నమూనాలు సే కరించి, పరీక్షలు చేయాల్సి ఉండగా నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.
నిర్లక్ష్యపు సమాధానాలు
ధరలు, కొలతలు, బిల్లు, గాలి, నీరు, మరుగుదొడ్లు వంటి అంశాలపై వినియోగదారులు ప్రశ్నించినప్పుడు స్పష్టమైన సమాధానం ఇవ్వడం బంకు సిబ్బంది బాధ్యత. సమస్యను అధికారులకు తెలియజేయాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదా వినియోగదారుల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని పలువురు అంటున్నారు.
తనిఖీలు నామమాత్రమే!
పెట్రోల్ బంకులపై పర్యవేక్షణ ఒకశాఖ బాధ్యతే కాదు.. కొలతల్లో మోసాలపై తూనికలు, కొలతలు, ఇంధన నాణ్యత–విక్రయ ప్రమాణాలపై చమురు సంస్థలు, భద్రతా అంశాలపై విభాగాలు, వర్తించే స్థానిక సౌకర్యాలు–పరిశుభ్రత అంశాలపై స్థానిక సంస్థలు తమ పరిధిలో చర్యలు తీసుకోవాలి. బంకుల వారీగా తనిఖీలు నిర్వహించి లోపాలను గుర్తించడం, సరిదిద్దేందుకు గడువు విధించడం, ఉల్లంఘనలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం అవసరం. కానీ కొందరు అధికారులు ఏనాడూ తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన బంకులపై చర్యలు తీసుకున్న దాఖలు లేవని వినియోగదారులు వాపోతున్నారు. ఆయా సమస్యలపై సంబంధిత శాఖల అధికారులను సంప్రదించగా.. ఫిర్యాదులు అందితే తక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిబంధనలు అతిక్రమించే ఎవరినీ ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.
పెట్రోల్ బంకులపై అధికారుల పర్యవేక్షణ కరువు
అనేకచోట్ల అలంకారప్రాయంగా గాలి నింపే యంత్రాలు
కంపుకొడుతున్న మరుగుదొడ్లు.. అపరిశుభ్రంగా తాగునీరు
డిస్‌ప్లేలో కనిపించని ధరలు.. నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు


