పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: రాఘవాపూర్‌లో దళిత యువకులను సీఐ ప్రవీణ్‌కుమార్ చితకబాదిన వ్య వహారంపై విచారణ జరిపించాలనే డిమాండ్‌తో ద ళిత సంఘం నాయకులు స్థానిక రాజీవ్‌రోడ్డుపై ఆది వారం రాస్తారోకో చేశారు. అధికార పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ వెంకటేశ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ దళిత యువకులు నవీన్, ప్రణయ్, శ్రీశైలంపై సీఐ దౌర్జన్యం చేశారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని ప్రజాసంఘాల నాయకు లు అశోక్, శ్రావణ్, కుక్క అశోక్, సీపెల్లి రవీందర్, ప్రశాంత్, సిద్దు, రవి, రాజయ్య, నెహ్రూ డిమాండ్ చేశారు. దీనిపై సీఐని వివరణ కోరగా.. ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా దాడి చేయలేదన్నారు.
ఎమ్మెల్యేపై బురద చల్లేందుకే..
రాఘవాపూర్‌లో అకారణంగా గొడవలు సృష్టించి ఎమ్మెల్యేపై బురద చల్లేందుకే కొందరు కుట్రపూరి తంగా వ్యవహరిస్తున్నారని మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేశ్ ఆరోపించారు. శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు అశోక్, శ్రావణ్, నవీన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే ఎవరు తొలగించారు? ఎందుకు తొలగించారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చే శారు. సీఐపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రంగాపూర్ సర్పంచ్ గంట రమేశ్, నాయకు లు ముడుసు సాంబిరెడ్డి, సదయ్య, తిరుమల్, రా మస్వామి, సంజీవ్, అంజయ్య, సంపత్ ఉన్నారు.


