కాంట్రాక్ట్‌ కార్మికుల పక్షపాతి కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ కార్మికుల పక్షపాతి కాంగ్రెస్‌

Oct 26 2026 12:22 AM | Updated on Oct 26 2026 12:22 AM

రామగిరి: కాంట్రాక్ట్‌ కార్మికుల హక్కుల సాధన, సంక్షేమం కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమని ఐఎన్టీయూసీ కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం ఆర్జీ–3 ఏరియా ఉపాధ్యక్షుడు ఉడత శంకర్‌ అన్నారు. సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5,500 బోనస్‌ను ఆదివారం అందజేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆర్జీ–3 ఏరియాలోని ఓసీపీ–2 పరిధి సీ–5 ఓబీ కంపెనీలో ఐఎన్టీయూసీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్‌ జనక్‌ ప్రసాద్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్మికుల శ్రమను గుర్తించి బోనస్‌ అందించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి కిరణ్‌రెడ్డి, మబ్బు శంకర్‌, మల్లారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement