జీఎంపై కేసు నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

జీఎంపై కేసు నమోదు చేయాలి

Oct 26 2026 12:22 AM | Updated on Oct 26 2026 12:22 AM

గోదావరిఖనిటౌన్‌: ఇటీవల మృతి చెందిన బీటెక్‌ విద్యార్థిని తాండ్ర అక్షితారాణి ఘటనలో నిర్లక్ష్యం వహించిన సింగరేణి ఆర్జీ–1 జీఎంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఇంజం వెంకటస్వామి డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మట్లాడారు. విద్యార్థిని మైనింగ్‌ శిక్షణ సమయంలో వేధింపులకు గురై జీఎంకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే అక్షితారాణి మృతి జరిగిందని, ఇందులో నిర్లక్ష్యం వహించిన జీఎంపై కేసు నమోదు చేయాలన్నారు. బాధితురాలి కుటుంబంలో ఒకరికి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కాకుండా పర్మినెంట్‌ ఉద్యోగం ఇప్పించి, మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement