గోదావరిఖని: హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మల్టీఫుల్ డేస్ మహాధర్నాకు సీఐటీయూ నాయకులు ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఈనెల 25, 26వ తేదీల్లో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద రాష్ట్రంలోని వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్వహించే ధర్నాలో పాల్గొన్నారు. కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, సింగరేణి సంస్థకు బకాయిపడ్డ రూ.59వేల కోట్లు చెల్లించాలని, కాంటాక్ట్ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.42 వేల నిర్ణయించాలని, కార్మికులకు సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, నాయకులు మంద నరసింహారావు, అల్లి రాజేందర్, మెండె శ్రీనివాస్, వంగల శివరాంరెడ్డి, నవీన్, కుంట ప్రవీణ్, డి.కొమరయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.


