విద్యార్థులకు ఆహార భద్రత కల్పించే కార్యక్రమాలను ప్ర భుత్వం చేపట్టింది. పిల్లలు ఆకలితో పస్కూళ్లకు వెళ్లడంతో ఏకాగ్రత, విద్యలో పట్టు రావడంలేదు. నాణ్యమైన ఆహారంతో ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి.
– విజయరమణారావు, ప్రభుత్వ విప్
ఆకలి సమస్య ఉండొద్దు
విద్యార్థులు ఆకలితో స్కూళ్ల కు రావొద్దని ప్రభుత్వం ఉదయం అల్పాహారం అందిస్తోంది. వారి ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతోపాటు చదువుపై ఏకాగ్రత పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. డ్రాప్ అవుట్ సంఖ్య కూడా తగ్గుతుంది.
– కోయ శ్రీహర్ష, కలెక్టర్


