చదువుకు ముందే అల్పాహారం | - | Sakshi
Sakshi News home page

చదువుకు ముందే అల్పాహారం

Sep 26 2026 12:38 AM | Updated on Sep 26 2026 12:38 AM

● టిఫిన్‌ చేశాకే చదువు ● 40,052 మంది విద్యార్థులకు ప్రయోజనం ● మంథనిలో అత్యాధునిక సెంట్రలైజ్డ్‌ కిచెన్‌

● టిఫిన్‌ చేశాకే చదువు ● 40,052 మంది విద్యార్థులకు ప్రయోజనం ● మంథనిలో అత్యాధునిక సెంట్రలైజ్డ్‌ కిచెన్‌

పెద్దపల్లి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా ర్థులకు ఉదయం అల్పాహారం అందిస్తున్నారు. ఆ హారం తీసుకోకుండా స్కూళ్లకు వచ్చేవారిలో నీరసం, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు తలెత్తకుండా టిఫిన్‌ అందిస్తున్నారు. అల్పాహారం తీసుకున్నా ఉత్సాహంగా తరగతులకు హాజరవుతూ చదువుపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుందని ఉ పాధ్యాయులు చెబుతున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందడంతో పేద, మ ధ్యతరగతి విద్యార్థులకు ఆహారభద్రత బలోపేతం అవుతుందని కూడా భావిస్తున్నారు. హాజరుశాతం కూడా పెరుగుతుందని వారు అంటున్నారు.

40,052 మందికి ప్రయోజనం

మంథనిలో సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అల్పాహాం పథకం ప్రారంభించా రు. అయితే, మంథనిలోని కిచెన్‌ ద్వారా జిల్లాలోని 40,052 మంది పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. దీనిపరిధిలో 694 స్కూళ్లు, 17 కళాశాలలు ఉన్నాయి.

కిచెన్‌లో ఆధునిక సదుపాయాలు

మంథని అగ్రికల్చరల్‌ మార్కెట్‌యార్డులోని 8వేల చదరపు అడుగుల షెడ్డులో ఆధునిక సదుపాయాలతో కిచెన్‌ ఏర్పాటు చేశారు. మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, ఫుడ్‌ ల్యాబ్‌, ఆహార నాణ్యత–పరిశుభ్రత–భద్రతకు ఏర్పాట్లు చేశారు. గంటకు 5,400 ఇడ్లీ లు, 2,000 దోశలు, 3,000 పూరీలు తయారు చేసే ఆటోమేటిక్‌ యంత్రాలను సమకూర్చారు. 2 గంట ల్లో 5 వేల మందికి సరిపడా సాంబార్‌, కూరలు సి ద్ధం చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఆటోమేటిక్‌ వెజిటబుల్‌ వాషింగ్‌, కటింగ్‌ యూనిట్లు, ఆర్వో వాటర్‌ ప్లాంట్‌, బాయిలర్‌, సెంట్రల్‌ గ్యాస్‌ బ్యాంక్‌, ఈటీ పీ, వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ తయారీ వ్యవస్థలనూ ఏర్పాటు చేశారు.

వారానికి ఆరు రకాల మెనూ

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ సూచనల మేరకు మెనూ రూపొందించారు. సోమవారం ఇడ్లీ –సాంబార్‌, మంగళవారం పూరి–ఆలూ కుర్మా, బు ధవారం దోశ–చట్నీ, గురువారం ఉప్మా–చట్నీ, శు క్రవారం మిల్లెట్‌ ఇడ్లీ–సాంబార్‌, శనివారం బొడా–చట్నీ అందించనున్నారు. కిచెన్‌ నిర్మాణానికి సింగరేణి సీఎస్‌ఆర్‌ నిధులు అందించింది. హరే రామ.. హరే కృష్ణ చారిటబుల్‌ నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement