పక్కా సాక్ష్యాలతోనే రుజువైన నేరం | - | Sakshi
Sakshi News home page

పక్కా సాక్ష్యాలతోనే రుజువైన నేరం

Sep 26 2026 12:38 AM | Updated on Sep 26 2026 12:38 AM

● పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి

● పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి

సుల్తానాబాద్‌రూరల్‌: ఆధునిక సాంకేతిక జోడించి పక్కాగా సాక్ష్యాధారాలు కోర్టు ముందు ఉంచడంతో నే కాట్నపల్లిలోని రైస్‌మిల్లులో చిన్నారి(6)పై హ త్యాచారం చేసిన కేసులో నిందితుడికి జీవితాంతం(మరణించే వరకూ) జైలు పడిందని పెద్దపల్లి డీసీ పీ భూక్య రాంరెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో మాట్లాడారు. 2024 జూన్‌ 13న కాట్నపల్లిలో ని ఓ రైస్‌మిల్లులో పనిచేసే దంపతులు నిద్రిస్తుండ గా, తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని బిహార్‌కు చెందిన వినోద్‌ మాజీ అపహరించి హత్యాచారం చేశాడ ని తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రవణ్‌ ఆధ్వర్యంలో పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారని పేర్కొన్నారు. పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలను ప బ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డొంకన రవీందర్‌ కోర్టులో సమర్థవంతంగా ప్రవేశపెట్టారని, పరిశీలించిన జడ్జి.. నిందిడికి జీవితాంతం జైలు శిక్షతోపాటు రూ.28 వే ల జరిమానా విధించారని వివరించారు. బాధిత కు టుంబానికి జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ద్వారా రూ.3 లక్షల పరిహారం అందించాలని ఆదేశించార ని పేర్కొన్నారు. కేసును సవాల్‌గా తీసుకొని నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన చేసిన ఏసీపీ కృష్ణ, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రవీందర్‌, కోర్టు కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ను డీసీపీ శాలువాతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement