హమాలీల కొరత తలెత్తొద్దు | - | Sakshi
Sakshi News home page

హమాలీల కొరత తలెత్తొద్దు

Sep 26 2026 12:38 AM | Updated on Sep 26 2026 12:38 AM

పెద్దపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసు కోవాలని అదనపు కలెక్టర్‌ శ్రీరాములు ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై హమాలీ సంఘాల ప్రతినిధులు, లారీ ఓనర్లు, అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షించారు. రైస్‌మిల్లుల్లో హమాలీల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొరత ఉన్న ప్రాంతాల్లో బిహార్‌ కార్మికులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అక్టోబర్‌ మొదటివారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామ ని, ఆలోగా ఏర్పాట్లు పూర్తిచేయాలని అన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్‌, మేనేజ ర్‌ శ్రీకాంత్‌, డీసీవో శ్రీమాల పాల్గొన్నారు.

అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక

పెద్దపల్లిరూరల్‌: అప్పన్నపేట జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థి రవితేజ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల కు ఎంపికయ్యాడు. షాట్‌పుట్‌లో బంగారు ప తకం సాధించి రాష్ట్రస్థాయి పోటీల్లో అర్హత పొందాడని పీఈటీ వేల్పుల సురేందర్‌ తెలిపారు. హనుమకొండలో శని, ఆదివారాల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థిని ఇన్‌చా ర్జి హెచ్‌ఎం అశోక్‌తోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు అభినందించారు.

విద్యుత్‌ సిబ్బందికి సన్మానం

పెద్దపల్లి: విద్యుత్‌ బిల్లుల వసూలులో వందశా తం నమోదు చేసిన కనుకుల సిబ్బందిని ట్రా న్స్‌కో ఎస్‌ఈ గంగాధర్‌ శుక్రవారం సన్మానించారు. గృహ, వాణిజ్య విద్యుత్‌ బిల్లుల వసూ లు 100 శాతాన్ని గడువువుకు ఏడురోజులు ముందుగానే పూర్తిచేశారని ప్రశంసించారు. ఎ స్‌ఈతోపాటు డీఈ రాజబ్రహ్మచారి శాలువాల తో సిబ్బందిని సత్కరించారు. ఏఈ కిశోర్‌ అభినందించారు. సుల్తానాబాద్‌ ఏడీఈ రామస్వా మి, డీఈ(టెక్నికల్‌) తదితరులు పాల్గొన్నారు.

నార్కోటిక్స్‌ డాగ్‌ టీమ్‌ తనిఖీలు

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు పరిసరాల్లో రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన నార్కోటిక్స్‌ డాగ్‌ టీమ్‌ శుక్రవారం తనిఖీలు చేసింది. పాన్‌షాపులతో పాటు వివిధ ప్రాంతాల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేసినట్లు తెలిసింది. ఈమేరకు పాన్‌షాపులు, అనుమానాస్పద ప్రాంతాల్లో నార్కోటిక్స్‌ డాగ్‌ టీమ్‌ తనిఖీలు నిర్వహించింది.

సింగపూర్‌ విద్యావిధానం భేష్‌

ధర్మారం: సింగపూ ర్‌ విద్యా వ్యవస్థ మంచిసందేశాన్నిస్తుందని, నాణ్యమై న విద్య పరీక్షల ఫలితాలపై ఆధారపడ కుండా ప్రతిభపై ఆధాపడి ఉంటుందని రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీమోహనాచార్యులు తెలిపా రు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నూతన ఆవిష్కరణల కోసం సీఎం రేవంతరెడ్డి చేపట్టిన సింగపూర్‌ విజిట్‌లో వంశీమోహాచార్యులు పాల్గొన్నారు. అక్కడి విద్య భవిష్యత్‌ అవసరాలకు అ నుగుణంగా, మారుతున్న వ్యవస్థగా గుర్తింపు పొందిందన్నారు. పాఠ్యాంశ జ్ఞానంతోపాటు వ్యక్తిత్వ, వికాసం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం, డిజిటల్‌ సాక్షరత, సహకారం జీవితం నేర్చుకునే అలవాట్లకు ప్రాధాన్యత ఉంటుందని వివరించారు.

9 శాతం అధిక వర్షపాతం

పెద్దపల్లి: జిల్లాలో సాధారణం కన్నా 9శాతం అ ధికంగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల తో చెరువులు, కుంటలు, వాగులు జలకళ సంతరించుకున్నాయి. వ్యవసాయ రంగానికి ఎంతో ఊరటనిచ్చాయి. వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు సమృద్ధిగా నీరు అందడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement