● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: వృద్ధుల సంక్షేమం, సంరక్షణ, హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ‘ఎల్డర్ గైడ్’ అవగాహన పోస్టర్‌ను కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. వృద్ధులను గౌరవించి అవసరాలు గుర్తించి సహాయ, సహకారాలు అందించడం అందరి సామాజిక బాధ్యతని ఆయన అన్నారు.
భూసేకరణలో మోసపోవద్దు
రామగుండం, ఎన్టీపీిసీ, సింగరేణి తదితర సంస్థలతోపాటు రాజాపూర్, జాతీయ రహదారులు, రైల్వే మార్గాల విస్తరణ కోసం చేపట్టే భూసేకరణలో దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ శ్రీహర్ష నిర్వాసితులకు సూచించారు. భూసేకరణ పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు. నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
యువతకు ఉపాధి
పారిశ్రామిక రంగాల్లో యువతకు మెరుగైన ఉపాధి, నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఎంప్లాయ్‌మెంట్, ట్రైనింగ్, ఇండస్ట్రీ, ఎంగేజ్‌మెంట్ అంశాలపై వివిధ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించి పలు సూచనలు చేశారు.
అభ్యసన సామర్థ్యాలు సాధించాలి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఎక్స్‌ఎల్‌తో విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన సామర్థ్యాలను సాధించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. ఏఎక్సెల్ అమలుపై ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, ప్రతినిధులు పీఎం షేక్, రాజయ్య, కౌసల్య, స్వర్ణలత, జీవన్‌రాజు, సతీశ్, రాజశేఖర్, శ్యామ్, హరిహర్, వంశీ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.


