రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్ ఏరియాలో ముస్లింలు మంగళవారం రాత్రి గ్యార్మీ షరీఫ్ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈనె ల 11న ప్రారంభమైన గ్యార్మీ షరీఫ్ వేడుకలను నెలరోజుల పాటు నిర్వహించనున్నట్లు మతపెద్దలు తెలిపారు. రైల్వేస్టేషన్ ఏరియా రహ్మత్‌నగర్ కాలనీలో షేర్–ఏ–నూర్ కమి టీ సభ్యులు ఏటా గంధాన్ని కన్నాల షరీఫ్ ప్రాంతానికి తీసుకెళ్లడం ఆనవాయితీ. ఈ మేరకు మంగళవారం రాత్రి జెండాలు పట్టుకొని డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా ముస్లింలు గ్యార్మీ షరీఫ్ వేడుకలను జరుపుకున్నా రు. భక్తులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఊరేగింపులో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా రామగుండం సీఐ కృష్ణకుమార్, ఎస్సైలు సంధ్యారాణి, వెంకటస్వామితోపాటు పోలీసు బలగాలను రైల్వేస్టేషన్ ఏరియాలో మొహరించారు.


