సుల్తానాబాద్‌రూరల్: గ్రామీణ విద్యార్థులు ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అల్పాహారం అందిస్తోందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. గర్రెపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు మంగళవారం అల్పాహారం ప్రారంభించి మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.70కో ట్లు వెచ్చించామని తెలిపారు. సర్పంచ్ వీరగొని రమేశ్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఎంఈవో రాజ య్య, సింగిల్‌విండో చైర్మన్ జానీ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నమని రాజిరెడ్డి, సర్పంచ్ తిరుమల్‌రావు, హెచ్‌ఎం కవిత, నాయకులు అజయ్‌గౌడ్, వెంకటేశం, దీకొండ శ్రీనివాస్, పన్నాల రాములు తదితరులు పాల్గొన్నారు.
దసరాకు బస్సు డిపో ప్రారంభం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో చేపట్టిన బస్సు డిపో పనులు చివరి దశకు చేరాయని, దసరా పండుగ వరకు ప్రారంభానికి సిద్ధం చేస్తామ ని ప్రభుత్వ విప్ విజయరమణారావు తెలిపారు. దీనికోసం రూ.8 కోట్లు మంజూరు చేశామని ఆయ న అన్నారు. పనుల ప్రగతినికి పర్యవేక్షించారు. దేవీనవరాత్రి ఉత్సవాల్లో డిపో ప్రారంభించేలా పనులు వేగంగా పూర్తిచేయాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ ముత్యాల నరేశ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బూతగడ్డ సంపత్, నాయకులు జంపయ్య, శ్రీనివాస్ తదితరులతోపాటు ఆర్టీసీ అధికారులు రాంగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతుకుముందు వినాయక విగ్రహాల ఎదుట విప్ పూజలు చేశారు.


