సీసీ కెమెరాలు.. డ్రోన్లు | - | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరాలు.. డ్రోన్లు

Sep 23 2026 12:07 AM | Updated on Sep 23 2026 12:07 AM

● నిఘా నీడన గణేశ్‌ నిమజ్జనం ● పోలీస్‌ శాఖ పకడ్బందీ ఏర్పాట్లు ● నేడు వినాయక నిమజ్జన వేడుకలు ● గోదావరి వంతెనపై ట్రాఫిక్‌ ఆంక్షలు

పోలీసు బలగాలు ఇలా..

ఏసీపీలు 4

సీఐ/ఆర్‌ఐలు 15

ఎస్‌ఐ/ఆర్‌ఎస్‌ఐ 25

హెడ్‌కానిస్టేబుళ్లు 26

కానిస్టేబుళ్లు 81

మహిళా కానిస్టేబుళ్లు 14

హోంగార్డులు 30

స్పెషల్‌ పార్టీ 25

ట్రాఫిక్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ 40

సింగరేణి సెక్యూరిటీ 100

మొత్తం విగ్రహాలు 2,659

గోదావరిఖని: అడుగడుగునా సీసీ కెమెరాలు.. డ్రోన్ల నిరంతర పర్యవేక్షణ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం.. ఈసారి వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు రామగుండం పోలీసులు అనుసరిస్తున్న ప్రత్యేక ప్రణాళిక ఇది. శోభాయాత్రకు ఇప్పటికే రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు. జిల్లాలో బుధవారం నిర్వహించే గణేశ్‌ నిమజ్జనం కోసం సర్వసన్నద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 2,659 గణపతి విగ్రహాలు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసుశాఖ ఆధ్వ ర్యంలో నిమజ్జన వేడుకలను విజయవంతం చే సేందుకు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు.

సీసీ, డ్రోన్‌ కెమెరాలతో నిఘా

జిల్లావ్యాప్తంగా ఈసారి గణేశ్‌ నిమజ్జనాన్ని పూర్తిగా సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షిస్తారు. శోభాయాత్ర మొదలుకుని నిమజ్జనం వరకూ అడుగడుగునా నిఘా కొనసాగుతుంది. సీపీ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూంలో శోభాయాత్ర ఆసాంతం పరశీలించనున్నారు. ట్రాఫిక్‌ సమస్య ఏర్పడినా, శోభాయాత్రలో వాహనాల కదలికలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

గోదావరి బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌ మళ్లింపు

గోదావరిఖని సమీపంలోని గోదావరి వంతెన పై నుంచి నదిలో విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో మంచిర్యాల వైపు వెళ్లే వాహనాలను మళ్లించారు. మంచిర్యాల వైపు వెళ్లే, గోదావరిఖనివైపు వచ్చే వాహనాలను ఒకేవైపు.. గోదావరిఖని మిలీనియం క్వార్టర్ల సమీపం నుంచి మళ్లిస్తారు.

అత్యవసర సేవలకు హెల్ప్‌లైన్‌

పెద్దపల్లిరూరల్‌: గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా డీజేలకు అనుమతి లేదని డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ స్పష్టం చేశారు. అత్యవసర సేవలు, సమస్యల కోసం టోల్‌ఫ్రీ నంబరు 1912కు లేదా కంట్రోల్‌రూం నంబర్లు 87124 84198, 8712 484165కు సమాచారం అందించాలని సూచించారు. పెద్దపల్లిలోని ఎల్లమ్మ, గుండమ్మ చెరువు వద్ద నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తిచేసినట్టు మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌ తెలిపారు.

నిమజ్జన ప్రాంతాలు ఇదే..

గోదావరిఖని గోదావరి వంతెన

అంతర్గాం గోలివాడ పుష్కరఘాట్‌

మంథని గోదావరినది పుష్కరఘాట్‌

పెద్దపల్లి ఎల్లమ్మ, గుండమ్మ చెరువు

సుల్తానాబాద్‌ ఊరచెరువు

ఏర్పాట్లు.. జాగ్రత్తలు

నిమజ్జన ప్రాంతాల్లో ఫ్లడ్‌లైట్లు, క్రేన్లు ఏ ర్పాటు చేశారు. నీటి వసతి కల్పించారు

గోదావరి వద్ద గజఈతగాళ్లను అందుబాటులో ఉంచారు

ప్రధాన రోడ్లను మరమ్మతు చేశారు

నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన వాహనం కండీషన్‌, డాక్యుమెంట్లు సరిగ్గా ఉండాలి. డ్రైవర్‌ వివరాలు కమిటీకి ఉండాలి

శోభాయాత్రలో దేవుడి పాటలే ఉపయోగించాలి

భక్తులు, డ్రైవర్లు మద్యం తాగొద్దు

డీజేలు ఉపయోగించొద్దు

చీకటిపడేలోగా నిమజ్జనం పూర్తిచేయాలి

నిమజ్జన ప్రదేశాల్లో ఫొటోలు, సెల్ఫీలకు అనుమతిలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement