రామగుండంలోని ఓ బేకరీలో తయారవుతున్న కేక్‌లకు కాలంచెల్లిన ఈ ముడుసరుకులు వినియోగిస్తున్నారు. రంగు, రుచికోసం రసాయనిక రంగులు వాడుతున్నారు.
ఇవి పెద్దపల్లిలోని ఓ షాప్‌లో విక్రయిస్తున్న పచ్చళ్ల బాటిళ్లు. లేబుళ్సు లేవు. కారం, పసుపు, నెయ్యి, నూనెలు కూడా తయారీ కంపెనీ, చిరునామా లేకుండానే విక్రయిస్తున్నారు.
కంపెనీ పేరు లేదు. తయారీ తేదీ కనిపించదు. గడువు ఎక్కడా కానరాదు. ఇందుకు నిదర్శనమే లూస్ ఆయిల్ విక్రయించే డబ్బాలు ఇవి.
సాక్షి, పెద్దపల్లి:
పాలు, టీపొడి నుంచి వంటనూనె, పసుపు, కారం, నెయ్యి, సబ్బులు, మిరియాలు, తేనె, ప ప్పుదినుసులు.. ఇలా ఒక్కటేమిటీ.. సరుకులన్నింటినీ కల్తీ చేస్తున్నారు. హోటళ్లు, కిరాణాలు, బేక రీలు, మిఠాయి దుకాణాల్లోనూ కల్తీ యథేచ్ఛగా సాగుతోంది. లూస్ సరుకులేకాదు.. ప్యాకెట్లలో వి క్రయించే వాటిపైనా లేబుళ్లు, తయారీ, గడువు తే దీలు, తయారీదారు వివరాలు ఉండడంలేదు. జి ల్లాలో గత ఏప్రిల్ నుంచి ఈనెల 15వ తేదీ వరకు పెద్దపల్లి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో సేకరించిన 95 ఆహార నమూనాల్లో 32 సరుకులు కల్తీగా నిర్ధారణ కావడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. న మూనాల సంఖ్య పరిమితమే అయినా.. పరీక్షించిన వాటిలో ఇంతభారీగా కల్తీ ఉండడం ఆహార భద్రత పర్యవేక్షణపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
● కల్తీ ఎలా చేస్తున్నారంటే..
కారప్పొడిలో సూడాన్ రంగు, ఇటుకపొడి, పసుపు లో బొప్పాయిపిండి, చాక్‌పీస్ పౌడర్, మైదా, లీడ్ క్రోమెట్, మెటానిల్ ఎల్లో వంటివి కలుపుతున్నారు. తేనెలో చక్కెరపాకం, టీపొడిలో కొబ్బరిపీచు, ఇను పపొడి, కృత్రిమ రంగులు, పప్పు దినుసులకు ఎల్లో టార్‌ట్రాజైన్‌తో పాలిష్, వంటనూనెల్లో ట్రై ఆర్థో క్రె సిల్ ఫాస్ఫేట్ వంటి విషతుల్య రసాయనాలు, సగ్గుబియ్యంలో ఆప్టికల్ ఫైబర్ రంగు, బేకరీ ఉత్పత్తుల్లో ఎల్లో కలర్ వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది.
● ఆరోగ్యానికి ముప్పు
కల్తీ ఆహారం తీసుకుంటే కిడ్నీ, గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్, చర్మ సమస్యలు, నాడీవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీర్ణకోశ, పెద్దపేగు, అన్నవాహిక క్యాన్సర్లకూ ఇవే ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. అనుమానాస్పద సరుకులు ఉంటే 91001 05795, 040–21111111 నంబర్లకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇది పెద్దపల్లిలోని ఓషాప్. అపరిశుభ్ర వాతావర ణంలోనే బన్, బ్రెడ్ తయారు చేశారు. బ్రాండ్ పేరు, తయారీ, గడవుతేదీ ఏమీలేదు. ఖారా, చెకోడి తదితర తినుబండారాలు ఇలాగే తయారు చేసి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు.


