కమాన్‌పూర్: గుండారం రి జర్వాయర్‌లో బుధవారం జరిగే గణేశ్ విగ్రహాల నిమజ్జన కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. సర్పంచ్ జంగిలి పోచాలు, ఆర్‌ఐ స్రవంతి మంగళవారం పనులు పరిశీలించారు. ‘నిమజ్జన ఏర్పాట్లు ఏవీ’ శీర్షికన మంగళశారం సాక్షి దినపత్రిలో కథనం ప్రచురితం కావడంతో అధికార యంత్రాంగం స్పందించింది. దారివెంట చెట్లపొదలు తొలగించి, గుంతలను మట్టితో పూడ్చివేయించారు. కట్టపై ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, జీపీవో కృష్ణ, వార్డు సభ్యులు రవి, దేవయ్య, కృష్ణ, మాజీ సర్పంచ్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
కరెన్సీ గణేశుడు
పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలోని స్వప్నకా లనీ టౌన్‌షిప్‌లో కొలువుదీరిన గణనాథుడిని భక్తులు రూ.6.66 లక్షల విలువైన కరెన్సీతో అలంకరించారు. ఇందుకోసం రూ.10, రూ. 20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోట్లు వినియోగించారు. స్వామివారిని తిలకించేందుకు వివిధ ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, మహిళా భక్తులు పాల్గొన్నారు.
వ్యాపారవేత్తలుగా ఎదగాలి
కమాన్‌పూర్: మహిళా సంఘాల సభ్యులు అ న్ని రంగాల్లో శిక్షణ పొంది నైపుణ్యం పెంచు కోవాలని, తద్వారా ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో వ్యాపారవేత్తలుగా ఎదుగాలని డీఆర్డీవో కాళిందిని సూచించారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆదివరాహ మండల సమాఖ్య సమావేశంలో పీడీ మాట్లాడారు. కమాన్‌పూర్ మండల సమాఖ్య రాష్ట్రంలోనే మోడల్‌గా అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం పీహెచ్‌సీ ఎదుట చేపట్టిన స్వచ్ఛ సేవలో పాల్గొన్నారు. ఎంపీడీవో ప్రియాంక, ఏపీఎం పద్మ, సర్పంచ్ రంగు సత్యనారాయణ, ఉప సర్పంచ్ సోహెల్, సీసీ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ఆయుర్వేదంతో ఆరోగ్యం
పెద్దపల్లి: ఆయుర్వేద వైద్యంతో ఆరోగ్యకరమై న భవిష్యత్ ఉంటుందని జిల్లా వైద్యాధికారి పవిత్ర అన్నారు. కలెక్టర్‌లో మంగళవారం ‘ఆ రోగ్యకరమైన భవిష్యత్ కోసం ఆయుర్వేదం’ అంశంపై డాక్టర్ పవిత్ర మాట్లాడారు. పౌష్టికా హారం, క్రమబద్ధమైన దినచర్య, వ్యాయామం, యోగా, మానసిక ప్రశాంతమైన జీవనశైలి వ్యాధులను నివారించవచ్చని ఆయుష్ అధికారులు తెలిపారు. ఏవో ప్రకాశ్, ఆర్డీవో గంగయ్య, ఆయుష్ జిల్లా ఇన్‌చార్జి అరుణ, నోడల్ అధికారి శోభారాణి, అమర్‌నాథ్, జిల్లా ప్రోగ్రా మ్ మేనేజర్ విద్యాసాగర్, ఫార్మసిస్ట్ సుధాకర్ అవగాహన కల్పించారు. అధికారులు, పలువు రు సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.
పిడుగుపడి రైతు మృతి
ఓదెల: కొలనూర్ గ్రామానికి చెందిన రైతు జంగ సుధాకర్‌రెడ్డి(65) మంగళ వారం పిడుగుపాటు కు గురై మృతి చెందా డు. గ్రామ శివారులో ని తన వ్యవసాయ పొలం వద్ద పనులు చేస్తుండగా ఉరుములు, పిడుగులతో కూడిన భారీవర్షం కురిసింది. ఈక్రమంలో హఠాత్తుగా పిడుగుపాటుకు గురై సుధాకర్‌రెడ్డి పొలంలోనే దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య పుష్ప, ఒక కుమారుడు, ఒకకూతురు ఉన్నారు.


