నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

Sep 22 2026 12:24 AM | Updated on Sep 22 2026 12:24 AM

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌: వినాయక నిమజ్జ న వేడుకలను ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు కట్ట వద్ద నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్‌ చైర్మన్‌ నూగిల్ల మల్లయ్య, కమిషనర్‌ వెంకటేశ్‌, ఏసీపీ కృష్ణతో కలిసి సోమవారం పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌, రహదారి, వైద్యం, భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. పలువురు పోలీస్‌ అధికారులు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న ఎత్తిపోతలు

ధర్మారం: ఎల్లంపల్లి ప్రాజెక్టు లింక్‌–2 నుంచి నందిమేడారం నంది రిజర్వాయర్‌లోకి వారం రోజులుగా నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. సోమవారం రెండు పంప్‌ల ద్వారా పంపింగ్‌ చేశారు. రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిన రోజూ రెండు మోటార్ల ద్వారా రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. ఒక్కో పంప్‌ నుంచి 3,150 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. ఇదేస్థాయిలో రెండు షట్టర్లను ఎత్తి కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ పంప్‌హౌస్‌కు అక్కడ నుంచి మిడ్‌మానేర్‌కు నీటిని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

చారిత్రక ప్రాంతాల సందర్శన

పెద్దపల్లి: జిల్లా సోషల్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో ఈనెల 20న విజ్ఞాన, విహార యాత్ర చేపట్టారు. మనజిల్లాకు చెందిన సుమారు 50 మంది సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు మంచిర్యాల జిల్లా లోని గంధారి ఖిల్లా, గంధారి మైసమ్మ ఆలయం, భైరవుడు, పదితలల నాగశేషు తదితర ప్రాంతాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల చారిత్రక విశేషాలు, సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసాలు, భౌగోళిక ప్రత్యేకతల గురించి స్థానికుల ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జోడేఘాట్‌లోని కొమురంభీమ్‌ స్మృతిస్థలి, మరణించిన ప్రదేశం, గిరిజన మ్యూజియం సందర్శించారు. గోండు, ఆదివాసీల సంప్రదాయ పరికరాలు, జీవన విధానం, సంస్కృతి, చారిత్రక అంశాలు పరిశీలించారు. ప్రతినిధులు మారా రమేశ్‌, లింగం శ్రీనివాస్‌, ముద్రబోయిన కుమార్‌స్వామి, గడ్డం రాజనర్సు, కొండం శ్రీనివాస్‌రెడ్డి, వనపర్తి అంజయ్య, సీహెచ్‌ పోచయ్య, మూలా శ్రీనివాస్‌, కుమారస్వామి, యేసు, రాజమల్లు, కిషన్‌రెడ్డి, దూడం సురేశ్‌, రసూల్‌, సీమ హఫీజ్‌, స్వరూప, పద్మ తదితరులు పాల్గొన్నారు.

రెస్క్యూ పోటీలకు ఆహ్వానించాలి

గోదావరిఖని: సింగరేణిలో నిర్వహించే జోనల్‌ మైన్స్‌ రెస్క్యూ పోటీలకు అన్ని కార్మిక సంఘాలను ఆహ్వానించాలని కార్మిక నాయకులు మిర్యాల రాజిరెడ్డి, తుమ్మల రాజారెడ్డి, రియాజ్‌అహ్మద్‌ కోరారు. సోమవారం డైరెక్టర్‌(పా)ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈనెల 24న 55వ జోనల్‌ మైన్స్‌ రెస్క్యూ పోటీలను ఆర్జీ–2 ఏరియాలో నిర్వహిస్తున్నారని అన్నారు. ఈనెల 9తో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కాలపరి మితి ముగిసిందన్నారు. ఈనెల 17న డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌, సింగరేణి చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, డైరెక్టర్‌(పా)ను కలిసి వినతి పత్రం అందజేశామన్నారు. వెంటనే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో అన్నిసంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని విన్నవించామని వారు వివరించారు.

నేటినుంచి ప్రత్యేక శిబిరాలు

పెద్దపల్లి: అగ్రిస్టాక్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రతీరైతుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించేందు కు వ్యవసాయ శాఖ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ము మ్మరం చేసింది. ఇందుకోసం ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఏవో శ్రీనివాస్‌ సోమవారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement